Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయేంద్రప్రసాద్ గెడ్డం క‌థ ఇదే!

Advertiesment
విజయేంద్రప్రసాద్ గెడ్డం క‌థ ఇదే!
, గురువారం, 26 ఆగస్టు 2021 (16:24 IST)
vijayendra prasad
రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు కూడా. ఆయ‌న ఓ కొత్త‌క‌థ‌ను త‌యారుచేస్తున్నాడు. దాని గురించి ఆమ‌ధ్య వెల్ల‌డించారు. హాలీవుడ్‌కు ఓ క‌థ‌ను సిద్ధం చేశాన‌ని చెప్పాడుకూడా. ఇక దాని సంగ‌తి ఎలా వున్నా, ప్ర‌స్తుతం ఆయ‌న త‌న గెడ్డాన్ని బాగా పెంచుకుంటున్నాడు. దీనికి ఓ కార‌ణ‌ముంద‌ని తెలుస్తోంది. ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే టీమ్‌లోనే ఓ వ్య‌క్తి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ను మోడీలా చూపించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే చిన్న షార్ట్ ఫిలిం త‌ర‌హా క‌థ‌ను చెప్పాడ‌ట‌. అందుకే నో చెప్ప‌క‌పోయినా చూద్దాంలే అన్న‌ట్లుగా స‌మాధానం ఇచ్చాడ‌ని తెలుస్తోంది.
 
ఇక మోడీ గెడ్డం పెంచ‌డానికి ఓ కార‌ణం ఉంది. రామ‌సేతు నిర్మించేవ‌ర‌కు పెంచుతూనే వుంటాన‌ని చాలాకాలం నాడు ఆయ‌న చెప్పాడ‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇప్పుడు రాజ‌మౌళి కుటుంబీకులు బిజెపికి అనుకూలంగానే వున్నారు. క‌నుక ఓ సందేశాత్మ‌క క‌థ‌తో షార్ట్ ఫిలిం చేసే ఆలోచ‌న‌లో వున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే ఆయ‌న గెడ్డం పెంచుతున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే క‌థా చ‌ర్చ‌ల్లో కీర‌వాణిగారు మోడీగారు వ‌చ్చారా అంటూ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ను సంబోధిస్తాడ‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేచ్ వ‌ర్క్ మిన‌హా ఆర్‌.ఆర్‌.ఆర్‌. పూర్తి