Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

రామ్ వర్సెస్ రామ్ : నేటి నుంచి 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కర్టన్ రైజర్ ఎపిసోడ్

Advertiesment
Evaru Meelo Koteeswarulu
, ఆదివారం, 22 ఆగస్టు 2021 (15:01 IST)
టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ (రామ్), రామ్ చరణ్ (రామ్)లు ఒకే వేదికపై నుంచి కనిపించనున్నారు. ఈ ఇద్ద‌రు టాలీవుడ్ టాప్ హీరోలు మ‌రి కొద్ది రోజుల‌లో వెండితెర‌పై అద్భుతాలు సృష్టించ‌నుడ‌గా, ఆ లోపు బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధమయ్యారు. బిగ్ బి అమితాబ్ కౌన్ బనేగా కరోడ్ పతి తరహాలో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' అనే కార్య‌క్ర‌మం రూపొంద‌గా, ఆదివారం క‌ర్ట‌న్ రైజ‌ర్ ఎపిసోడ్ జ‌ర‌గ‌నుంది.
 
ఇప్ప‌టికే ఈ షోకి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇద్దరు బడా హీరోలు ఒకసారి బుల్లితెరపై కనిపిస్తే అది విస్ఫోటనమే అవుతుంది. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రారంభ ఎపిసోడ్‌కి రికార్డ్ స్థాయిలో టీఆర్పీ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 
 
ఆదివారం రాత్రి ప్ర‌సారం కానున్న ఎసిపోడ్ స్పెష‌ల్ కాగా, రేప‌టి నుండి రెగ్యుల‌ర్ ఎపిసోడ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ రోజు రాత్రి 8.30 నిల‌కు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంది. తొలి ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. 
 
ఇదిలావుంటే, ఈ ఇద్దరు హీరోలు కలిసిన 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సలార్' నుంచి అప్‌డేట్ : 23న ఉద‌యం 10.30ని.ల‌కు...