Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ దొంగ ముం*** కొడుకు.. వీడు మామూలోడు కాదండి: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ నోటిదూల (Video)

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (13:32 IST)
ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ బూతులు తిట్టారు. "ఈ దొంగ ముం... కొడుకు.. వీడు మామూలోడు కాదండి.. రేయ్ వార్నర్.. నీకు ఇదే నా వార్నింగ్" అంటూ హెచ్చరించాడు. 
 
టాలీవుడ్ యువ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌‍లో రూపొందిన చిత్రం "రాబిన్ హుడ్". ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. నితిన్ సరసన శ్రీలీల, కేతికశర్మలు హీరోయిన్లుగా నటించగా, ఈ నెల 28వ తేదీన విడుదలవుతుంది. 
 
ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరైన రాజేంద్ర ప్రసాద్.. వార్నర్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనేక మంది నెటిజన్స్ రాజేంద్ర ప్రసాద్‌‍ను తిట్టిపోస్తున్నారు. 
 
ఇందులో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, "హీరో నితిన్, దర్శకుడు వెంకీలు కలిసి ఈ వార్నర్‌ను పట్టుకొచ్చారు. అతడ్ని క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ముం... కొడుకు.. వీడు మామూలోడు కాదండి.. రేయ్ వార్నర్.. నీకు ఇదే నా వార్నింగ్ అని అన్నారు. 
 
అయితే, రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థంకాక, వార్నర్ నవ్వుతూ కనిపించాడు. రాజేంద్ర ప్రసాద్ సరదాగానే ఈ కామెంట్స్ చేసినా ఇలా మాట్లాడమేమిటని వార్నర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఈవెంట్‌లో శ్రీలీల, కేతిక శర్మలతో కలిసి డేవిడ్ వార్నర్ డ్యాన్స్ చేసి సందడి చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ ప్రియుడుని 20 సార్లు కత్తితో పొడిచిన భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments