Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Advertiesment
Miss World Thailand Suchata Chuangsri with director Sukumar, Tabitha Bandreddy

దేవీ

, మంగళవారం, 3 జూన్ 2025 (11:53 IST)
Miss World Thailand Suchata Chuangsri with director Sukumar, Tabitha Bandreddy
ప్రస్తుత మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ ఫుకెట్‌కు చెందిన సుచతా చువాంగ్స్రీ. ఆమె భారతదేశంలోని హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025లో థాయ్‌లాండ్‌కు ప్రాతినిధ్యం వహించి విజేతగా నిలిచింది. ఆనవాయితీగా ప్రముఖులతో కలిసి తేనేటీ విందులో పాల్గొనడం జరుగుతుంటుంది. రాజకీయనాయకులతోపాటు సినిరంగ ప్రముఖులు కలుసుకోవడం జరుగుతుంది. గతంలో మిస్ ఇండియా, మిస్ వరల్డ్ విజేతలను ప్రముఖ సినీప్రముఖులు కలవడం జరిగేవి.

webdunia
Sukumar, Tabitha Bandreddy, Governor Jishnu Dev Varma family
హైదరాబాద్‌లో నిన్న జరిగిన కార్యక్రమంలో తెలంగాణా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మిస్ వరల్డ్ థాయ్‌లాండ్‌తో డైరెక్టర్  సుకుమార్, ఆయన సతీమణి తబితా బండ్రెడ్డి కలిసిన ఫొటోలను షేర్ చేశారు.
 
ఇలా సినీ దర్శకులు కలవడం ఆనాయితీ అయినా ఆ తర్వాత వారు తమ సినిమాల్లో తీసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు. గతంలో విక్టరీ వెంకటేష్ సినిమాలో మిస్ ఇండియా కూడా ఎంపికచేశారు. బాలీవుడ్ లోనూ వారితో నటింపజేయడం జరుగుతూనే వుంది. తాజాగా తెలుగు దర్శకుడు సుకుమార్ మిస్ థాయ్ లాండ్ ను కలవడం విశేషం సంతరించుకుంది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ ప్రాజెక్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎలాగూ రాజమౌళి, మహేష్ బాబు సినిమా కూడా షూటింగ్ జరుగుతుంది. బహుశా రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ వుండవచ్చని ఫిలింనగర్ కథనాలు వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే