Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

Advertiesment
Devika and Danny web series team with Ritu Varma

దేవీ

, మంగళవారం, 3 జూన్ 2025 (19:07 IST)
Devika and Danny web series team with Ritu Varma
జియోహాట్‌స్టార్, డిస్నీ+ హాట్‌స్టార్  నుంచి జియో హాట్ స్టార్‌గా పున: నిర్మితమై తాజాగా  హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా‘దేవిక అండ్‌ డానీ’ అనే వెబ్ సిరీస్‌ను జూన్6 నుంచి అందిస్తుంది.

ఈ వెబ్‌సిరీస్‌లో రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. బి.కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చాగంటి దీన్ని నిర్మించారు. జూన్6 నుంచి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
 
హీరోయిన్ రీతూవ‌ర్మ మాట్లాడుతూ ‘‘వెబ్ సిరీస్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ వ‌స్తే చేద్దామ‌నుకున్నాను. ఆ స‌మ‌యంలో ‘దేవిక అండ్ డానీ’ వంటి నిజాయ‌తీతో కూడిన క‌థ నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఓ క‌థ‌ను న‌మ్మి ప్రొడ్యూస్ చేసిన మా సుధాక‌ర్‌గారికి థాంక్స్‌. ఆయ‌న మంచి సినిమాల‌ను, సిరీస్‌ల‌ను అందించాల‌నే ఉద్దేశంతో జాయ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశారు. ఇంకా ఇలాంటి సిరీస్‌లు, సినిమాల‌ను ఎన్నింటినో చేయాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్‌ కిషోర్‌గారు చాలా స‌ర‌దాగా ఉండే వ్య‌క్తి. ఫోక‌స్‌గా ఉంటారు. వెంక‌ట్ దిలీప్‌గారు మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌. ఇప్పుడు స్క్రీన్‌పై చూస్తుంటే ఆయ‌న ఎంత గొప్ప‌గా ఆలోచించారో అర్థ‌మ‌వుతుంది. మా డానీ సూర్య ఎంతో హార్డ్ వ‌ర్కింగ్ ప‌ర్స‌న్‌. చాలా ఇన్‌వాల్వ్ అయ్యి న‌టించాడు. సుబ్బు పాత్ర‌లో న‌టించిన శివ కందుకూరి త‌న పాత్ర‌లో ఒదిగిపోయారు. సుబ్బ‌రాజుగారు, కోవైస‌ర‌ళ‌గారు స‌హా ఎంటైర్‌టీమ్‌కు థాంక్స్‌. నందిని ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసింది. త‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. చాలా మంది అమ్మాయిల‌కు చుట్టు ప‌క్క‌ల ఉండేవాళ్లు నువ్వు ఇది చేయ‌లేవు అని చెప్పి డిస్క‌రేజ్ చేస్తుంటారు. కానీ అలాంటి వారికి ఈ సిరీస్ ఓ న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తుంది. మా సిరీస్ ‘దేవిక అండ్ డానీ’ జూన్‌6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’’ అన్నారు.
 
సూర్య‌వ‌శిష్ట్ మాట్లాడుతూ ‘‘సాధారణంగా ఊర్ల‌లో ఉండే అమ్మాయిల‌కు చాలా ఇబ్బందులుంటాయి. ఈ ప‌ని చేయాల‌ని, ఆ ప‌ని చేయ‌కూడ‌ద‌ని అంటుంటారు. అలాంటివాళ్లు బ‌య‌ట‌కు వెళితే ఎలా మారుతార‌నే ఓ విష‌యాన్ని చ‌క్క‌గా ‘దేవిక అండ్ డానీ’లో చూపించారు. దేవిక అనే అమ్మాయి జీవితాన్ని డానీ, సుబ్బు లాంటి పాత్ర‌లు ఎలా మార్చాయ‌నేది కూడా ఇందులో చూడొచ్చు. త‌ప్ప‌కుండా ఈ సిరీస్ అంద‌రికీ న‌చ్చుతుంది. నిర్మాత సుధాక‌ర్ అరుదైన వ్య‌క్తి. మా డైరెక్ట‌ర్ కిషోర్‌గారు మా ఫ్యామిలీ మెంబ‌ర్‌లా మాతో క‌లిసిపోయారు. సినిమాటోగ్రాఫ‌ర్ దిలీప్‌గారి ఫ్రేమింగ్‌, లైటింగ్ సూప‌ర్బ్‌. నందినిగారు బిహైండ్ ది సీన్స్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఫ్రెష్ కంటెంట్‌ను అందిస్తోన్న జియో హాట్‌స్టార్‌కి థాంక్స్‌. రీతూవ‌ర్మ చాలా మంచి కోస్టార్‌. శివ కందుకూరి అయితే నా బ్ర‌ద‌ర్‌లా మారిపోయారు. త‌ను అద్భుతంగా న‌టించాడు. డానీ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఆడియెన్స్‌కు అన్నీ పాత్ర‌లు చ‌క్క‌గా క‌నెక్ట్ అవుతాయి’’ అన్నారు.
 
శివ కందుకూరి మాట్లాడుతూ ‘‘వెబ్ సిరీస్ అంటే సాధారణంగా ఎంత వ‌ల్గ‌ర్ ఉందనే దాని గురించి మ‌నం మాట్లాడుతున్నాం. ఇలాంటి ప‌రిస్థితుల్లో ‘దేవిక అండ్ డానీ’ వంటి క్లీన్ స్క్రిప్ట్‌ను యాక్సెప్ట్ చేయ‌టం గొప్ప విష‌యం. మంచి వేల్యూస్ ఉన్న స్క్రిప్ట్‌ను ఒప్పుకున్నందుకు జియో హాట్‌స్టార్ వారికి ధ‌న్య‌వాదాలు. మంచి కంటెంట్‌ను అందించ‌టానికి వారు ముందుకొచ్చారు. మా నిర్మాత సుధాక‌ర్‌గారికి థాంక్స్‌. సినిమాకు ఏమాత్రం త‌గ్గకుండా గొప్ప టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సిరీస్‌ను రూపొందించారు. ఇందులో నేను సుబ్బు అనే పాత్ర‌ను పోషించాను. దేవిక అనే అమ్మాయి జీవితంలో వ‌చ్చే ప్ర‌తీ పాత్ర ఎలా ట్రావెల్ చేసిందో ఇందులో మ‌నం చూడొచ్చు. సుబ్బు అనే ఫ‌న్నీ పాత్ర‌ను చేయ‌టాన్ని ఎంజాయ్ చేశాను. నాపై న‌మ్మ‌కంతో నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చిన మా డైరెక్ట‌ర్ కిషోర్‌గారికి థాంక్స్‌. మా అంద‌రినీ ఇంత బాగా చూపించిన మా సినిమాటోగ్రాఫ‌ర్ వెంక‌ట్ దిలీప్‌గారికి థాంక్స్‌. దేవిక పాత్ర‌ను రీతూవ‌ర్మ గొప్ప‌గా చేసింది. ఆమె ఇంత‌కు ముందు చాలా మంచి పాత్ర‌ల్లో మ‌న‌కు క‌నిపించింది. ఇప్పుడిది మ‌రో మంచి పాత్ర అవుతుంది. సూర్య‌వ‌శిష్ట్ చేసిన డానీ, త‌న పాత్ర‌లోని వేరియేష‌న్స్‌ను చ‌క్క‌గా చేశాడు. ‘దేవిక అండ్ డానీ’ జూన్ 6 నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అంద‌రికీ ఈ సిరీస్ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.
 
నిర్మాత సుధాక‌ర్ చాగంటి మాట్లాడుతూ ‘‘‘దేవిక అండ్ డానీ’ వంటి సిరీస్‌తో మీ ముందుకు రానుండ‌టం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఏడు ఎపిసోడ్స్ ఉన్న సిరీస్‌. జియో హాట్‌స్టార్ వారు ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. జూన్‌6న స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ఎంట‌ర్‌టైన్మెంట్, ఎమోష‌న్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉండే సిరీస్ ఇది. నందినిగారికి థాంక్స్‌. ఆమె ఎంతో స‌పోర్ట్ చేశారు. ద‌ర్శ‌కుడు కిషోర్‌గారు సిరీస్‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. వెంక‌ట్‌గారు ఫెంటాస్టిక్ విజువ‌ల్స్ అందించారు. దీప‌క్‌రాజ్‌గారు క‌థ‌, డైలాగ్స్ ఇచ్చినందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. దేవిక పాత్ర‌లో రీతూవ‌ర్మ అద్భుతంగా న‌టించారు. ఓ ప‌ల్లెటూరులో ఉండే ఓ అమ్మాయి ఎలా ఎదిగింద‌నే క‌థ‌తో ఇది రూపొందింది. డానీ పాత్ర‌లో సూర్య‌, సుబ్బు పాత్ర‌లో శివ కందుకూరి చ‌క్క‌గా న‌టించారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.
 
డైరెక్ట‌ర్ బి.కిషోర్ మాట్లాడుతూ ‘‘‘శ్రీకారం’ త‌ర్వాత ఈ సిరీస్ చేయ‌టం చాలా ఆనందంగా ఉంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, ఇప్పుడు చూసిన రెండు ఎపిసోడ్స్ అంద‌రికీ న‌చ్చే ఉంటుంది. దీపక్ రాజ్ అనే రైట‌ర్ ద‌గ్గ‌ర నుంచి ఈ ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. త‌ర్వాత ఈ జ‌ర్నీలో రీతూవ‌ర్మ‌, సూర్య‌, శివ కందుకూరి, సుబ్బ‌రాజ్‌గారు అంద‌రూ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. సినిమాటోగ్రాఫ‌ర్ వెంక‌ట్ దిలీప్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్‌ను అందించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ జై క్రిష్, ఎడిట‌ర్ కార్తీక్ అంద‌రూ ఎంతో స‌పోర్ట్ చేశారు. నందినిగారు బిహైండ్ ది స్క్రీన్ అంతా తానై స‌పోర్ట్ చేశారు. మా నిర్మాత సుధాక‌ర్‌గారు త‌న ప్ర‌యాణాన్ని సిరీస్‌తో ప్రారంభించారు. ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ‘దేవిక అండ్ డానీ’ సిరీస్ చూసే ఆడియెన్స్ స‌మ‌యం వృథా కాదు. ప్ర‌తీ క్ష‌ణాన్ని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.
 
ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో మౌనిక‌, నందిని, సినిమాటోగ్రాఫ‌ర్ వెంక‌ట్ సి.దిలీప్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ జై క్రిష్‌, ఎడిట‌ర్ కార్తీక్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?