Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

Advertiesment
Sandeep Kishan, Ritu Varma

దేవి

, శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (18:24 IST)
Sandeep Kishan, Ritu Varma
ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా తొలిసారిగా ప్రజాదరణ పొందిన సొమ్మసిల్లి పోతున్నావే ఇప్పుడు న్యూ జనరేషన్ శ్రోతలను అలరించడానికి  రీఇన్వెంట్ చేశారు. ఇప్పటికే అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ జానపద పాటకు కొత్త ట్విస్ట్ ఇస్తూ హై ఎనర్జీ చార్మ్ ని తిరిగి పరిచయం చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్, మోడరన్  బీట్‌లను సాంప్రదాయ జానపద సౌండ్స్ బ్లెండ్ చేసి, ప్రేక్షకులను అలరిస్తుంది. పవర్ ఫుల్ రీమిక్స్ ఎనర్జీని పెంచుతుంది, ప్రతి ఒక్కరినీ కదిలించేలా వైరల్ సాంగ్ గా మారింది.
 
రాము రాథోడ్, ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన ఈ పాట  సాహిత్యం రస్టిక్  పదాలతో ఆకట్టుకుంది. రేవంత్  హై ఎనర్జీ వోకల్స్ పాటను మరింత ఎక్సయిటింగ్ గా మార్చాయి.  సాంగ్ అందరూ పాడుకునే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.  
 
సందీప్ కిషన్, రీతు వర్మ సాంప్రదాయ దుస్తులలో అద్భుతంగా కనిపించారు. విజువల్స్‌ కలర్ ఫుల్ గా వున్నాయి . మోయిన్ మాస్టర్ కొరియోగ్రఫీతో, డైనమిక్ డ్యాన్స్ మూవ్‌లు పాటకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యాయి. ఈ సెన్సేషనల్  ఫోక్ సాంగ్ ఈ సంవత్సరం అత్యుత్తమ పాటగా నిలుస్తుంది.
 
త్రినాధ రావు నక్కినతో సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులలో కొలబారేట్ అయిన రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, మజాకాకు కథ, స్క్రీన్‌ప్లే డైలాగ్స్ రాస్తున్నారు. ఈ చిత్రానికి నిజార్ షఫీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్షన్  వహిస్తుండగా, పృధ్వీ స్టంట్స్‌ను పర్యవేక్షిస్తున్నారు.
 మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మజాకా థియేటర్లలోకి రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి