Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

Advertiesment
Vijaykrishna Silver Crown Award receiving Director Anil Ravipudi

దేవి

, శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (18:09 IST)
Vijaykrishna Silver Crown Award receiving Director Anil Ravipudi
''విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా వుంది. కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు ఆడపులి. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నాను'అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. శ్రుతిలయ సీల్ వెల్ కార్పోరేషన్- కళాకారుల ఐక్యవేదిక సమక్షంలో ప్రముఖ నటీమణి, దర్శకురాలు విజయనిర్మల గారి జయంతి సందద్భంగా ప్రముఖ రచయిత దర్శకులు జంధ్యాల గారి 75 సం.ల వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణ తో పాటు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ 2025ని బహుకరించారు.

నవరసరాయ డాక్టర్ నరేష్ వికె సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర శానన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిధిగా జహారయ్యారు. హీరో మంచు విష్ణు, శివబాలాజీ, పవిత్ర లోకేష్, జంధ్యాల అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ, ప్రదీప్, సాయినాథ్ తో పాటు అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనారు.
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ, కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు ఆడపులి. అత్యధిక సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా రికార్డ్ సృష్టించారు. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నాను. ఇలాంటి అవార్డ్ నాకు అందించిన నరేష్ గారు ధన్యవాదాలు. నరేష్ గారు గ్రేట్ సన్, వారి అమ్మగారి పేరు మీద ఈ అవార్డ్ ని కొనసాగించడం చాలా ఆనందంగా వుంది. జంధ్యాల గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. ఆయన సినిమాలు చూస్తూ కామెడీ టైమింగ్ నేర్చుకున్నాను. ఈ రోజు నేను కామెడీ పండిస్తున్నానంటే ఆ క్రెడిట్ జంధ్యాల గారికి దక్కుతుంది. నవ్వు ద్వారా ప్రజలు దగ్గరైనందుకు గర్వంగా ఫీలౌతున్నాను. వరుస హిట్స్ కొడుతున్నాను. ఇంకా పీక్స్ రాలేదని భావిస్తున్న తరుణంలో 2025 లో సంక్రాంతి వస్తున్నాం లాంటి ఓ హాస్య ప్రధానమైన సినిమాతో దేవుడు ఓ అద్భుతమైన సినిమా ఇచ్చాడు. నరేష్ గారు గ్రేట్ పర్శన్. ఆయనతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా చేయడం ఆనందంగా వుంది. మళ్ళీ ఆయనతో కలసి పని చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ'అన్నారు.
 
నరేష్ వికే మాట్లాడుతూ.. జంధ్యాల గారిపై వున్న నమ్మకం. మేము మద్రాస్ లో వుండేవాళ్ళం. తెలుగు ఒత్తులు సరిగ్గా పలికేవి కావు. జంధ్యాల గారు డబ్బింగ్ చూసి అమ్మగారితో చాలా అందంగా ఓ మాట చెప్పారు. నరేష్ డబ్బింగ్ చెబితే పది సినిమాలు వస్తాయి. బాలు గారు డబ్బింగ్ చెబితే పది కాలాల పాటు ఉంటాడు అన్నారు. కేవలం నటన నేర్పించడమే కాదు భాష ని నేర్పించిన గురువు జంధ్యాల గారు. జంధ్య్యాల గారు విజయ నిర్మల గారు నా కెరీర్ ఓ పదేళ్ళు ముందుకు తీసుకెళ్ళి ఎన్నో మరపురాని సినిమాలు అందించి ఒక స్టార్ డమ్ ని తీసుకొచ్చారు. వజ్రోత్సవం అన్నప్పుడు రెండేళ్ళుగా ఓ ఆలోచన చేశాం. జంధ్యాల గారిపై ఓ పుస్తకం రాయాలని భావించాం. రచయిత సాయినాథ్ తోటపల్లి గారు ఆ భాద్యత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఈ పుస్తకం కోసం అనేక మైళ్ళు తిరిగి 40మంది ప్రముఖులని ఇంటర్వ్యూ చేసి ఈ పుస్తకాన్ని తయారు చేశారు. అమ్మ బర్త్ డే తో పాటు పవిత్ర బర్త్ డే కూడా ఈ రోజు రావడం ఆనందంగా వుంది. ఇవన్నీ కలిపి ఓ వేడుకలా జరుపుకోవడం ఆనందంగా వుంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దురాగతాలపై ఎక్కుపెట్టిన అస్త్రం దండోరా ఫస్ట్ బీట్ వీడియో