Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

Advertiesment
Anil Ravipudi

డీవీ

, శుక్రవారం, 10 జనవరి 2025 (18:10 IST)
Anil Ravipudi
'సంక్రాంతికి వస్తున్నాం' కథ అనుకున్నప్పుడు ఫెస్టివల్ ఫిల్మ్ అనుకోని స్టార్ట్ చేశాం. వెంకటేష్ గారితో చేసిన ఎఫ్2 పొంగల్ కి వచ్చి పెద్ద విజయం సాధించింది. ఎఫ్3 కూడా పొంగల్ కి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. ఈసారి చేసే సినిమా ఎలాగైనా పొంగల్ కి  తీసుకొస్తే బావుటుందని సినిమా ఓపెనింగ్ అప్పుడే సంక్రాంతికి రావాలని అనుకున్నాం.

ఈ కథ ఒక రేస్క్యు ఆపరేషన్ కి సంబధించింది. సెకండ్ హాఫ్ లో నాలుగు రోజులు జర్నీ సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. కథ అనుకున్నప్పుడే 'సంక్రాంతికి వస్తున్నాం' టైటిల్ కి ఫిక్స్ అయ్యాం డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు.
 
మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి విలేకరుల సమావేశంలో 'సంక్రాంతికి వస్తున్నాం' విశేషాల్ని పంచుకున్నారు.
 
సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా ఉండటానికి కారణం ?
కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి గొప్పగా తీయగానే సరిపోదు. థియేటర్స్ కి జనాలు రాకపోతే సినిమాకి రీచ్ వుండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన సినిమా వారి అటెన్షన్ ని గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్ తోచ్చుకోగాలమని నా అభిప్రాయం. ఈసారి సోషల్ మీడియాపై ఎక్కవ ఫోకస్ చేశాం. వెంకటేష్ గారు లాంటి పెద్ద స్టార్ దిగి సరదాగా అల్లరి చేయడం, రీల్స్ చేయడం ప్రమోషన్స్ కి చాలా హెల్ప్ అయ్యింది.
 
రమణగోగుల గారితో పాడించాలనే ఆలోచన ఎవరిది ?  
-భీమ్స్ ఇచ్చిన గోదారి గట్టు ట్యూన్ వినగానే ఒక పెక్యులర్ వాయిస్ తో పాడిస్తే బావుంటుదని అనుకుకొని రమణ గోగుల గారిని ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నాం. భీమ్స్ ఆయన్ని సంప్రదించి పాడించారు. ఈ క్రెడిట్ భీమ్స్ కి దక్కుతుంది. రమణ గోగుల గారు కూడా తన మార్క్ ని యాడ్ చేశారు. హిట్ సాంగ్ అనుకున్న పాట కాస్త ఈ రోజు గ్లోబల్ సాంగ్ అయ్యింది. 85 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.
 
ఐశ్వర్య రాజేష్ గారి ని ఆడిషన్ చేసి తీసుకోవడానికి కారణం ?
-భాగ్యం క్యారెక్టర్ చాలా స్పెషల్. వెరీ ఎడ్జ్ లో నడిచేది. చాలా కేర్ తీసుకొని చేయాల్సిన క్యారెక్టర్. ఐశ్వర్య బెస్ట్ పెర్ఫార్మర్. అయితే తను గోదారి యాస ఎలా పలుకుతుంది ? ఆ క్యారెక్టర్ లో తన బాడీ లాంగ్వేజ్ ఎలా వుంటుందో తెలుసుకోవడానికి చిన్న ఆడిషన్ లా చేశాం. భాగ్యం చాలా మంచి క్యారెక్టర్. ఐశ్వర్యకి మంచి పేరు వస్తుంది.
 
 ఇక మీనాక్షి కూడా చాల క్రమశిక్షణ గల నటి. తనకి మంచి టైం సెన్స్ వుంది. చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. ఇద్దరూ ఆదరగొట్టారు.
 
వెంకటేష్ గారితో పాట పాడించాలనే ఆలోచన ఎవరిది ?
-వెంకటేష్ గారికి బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ చాలా నచ్చేసింది. ఆయనే స్వయంగా పాడతానని చెప్పారు. నేను షాక్ అయ్యాను. అదే టైమింగ్ లో ఓ రీల్ చేశాం. వెంకటేష్ గారు 20 నిమిషాల్లో ఆ పాట పడేశారు. వెంకీ గారు పాడిన తర్వాత భీమ్స్ కూడా షాక్ అయ్యాడు.
 
'ఫ్లాష్ బ్యాకులు చెప్పొద్దు' అనే డైలాగు వెనుక ఉద్దేశం?
-జీవితంలో అందరికీ ఎదో ఒక గతం వుంటుంది. ఎక్స్ ప్రెస్ చేయకపోయినా కనీసం ఫస్ట్ క్రస్ వుంటుంది. పెళ్లి అయినాక ఓపెన్ గా వుండాలని చెప్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ మొదలౌతాయి. అందుకే గతం జోలికి పోకుండా హాయిగా ప్రజెంట్ లో వుండటమే మంచిది.      
 
దిల్ రాజు గారి బ్యానర్ లోనే ఎక్కువగా చేయడానికి కారణం ?
-ఆయనతో నాకు పటాస్ సినిమాతో ట్రావెల్ వుంది. నాకు ఎవరైనా కనెక్ట్ అయితే వాళ్ళతోనే ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాను. దిల్ రాజు గారు శిరీష్ గారు అంటే నాకు ఫ్యామిలీ. అల్మోస్ట్ పదేళ్ళ జర్నీ.  
 
ఎఫ్ 2 నుంచి 'సంక్రాంతికి వస్తున్నాం' వరకూ వెంకటేష్ గారితో జర్నీ ఎలా వుంది?
-ఎఫ్ 2, ఎఫ్ 3 కంటే 'సంక్రాంతికి వస్తున్నాం'తో మా బాండింగ్ డబుల్ అయ్యింది. ఈ సినిమాతో బెస్ట్ బడ్డీస్ అయిపోయాం. చాలా క్లోజ్ అయ్యాం. వెంకటేష్ గారితో సినిమాలు ఇలానే కంటిన్యూ చేయాలని భావిస్తున్నాను.
 
మీకు హీరోలతో మంచి బాండింగ్ ఏర్పడుతుంది కదా.. అది ఎలా సాధ్యపడుతుంది ?
-హీరోలని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అభిమానించానో వాళ్ళతో సినిమా చేసినప్పుడు కూడా అదే అభిమానంతో వుంటాను. నేను హీరోలకి ఫ్యాన్ బాయ్ లానే వుంటాను. రిలేషన్ ని పాజిటివ్ గా ఉంచుతాను కాబట్టి వాళ్ళ నుంచి కూడా అంతే ప్రేమ వస్తుంది.
 
ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఎలా అనిపించింది ?
-వెరీ హ్యాపీ. వెంకటేష్ గారితో ఎఫ్2, ఎఫ్3 చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో అంతే కాన్ఫిడెంట్ గా వున్నాం. పబ్లిక్ కూడా మేము హిట్ కొట్టేస్తామని కాన్ఫిడెంట్ గా వుండటం ఇంకా హ్యాపీ.
 
మీ డ్రీం స్టొరీ ఏదైనా ఉందా ?
-విమెన్ సెంట్రిక్ గా ఒక స్పోర్ట్స్ స్టొరీ చేయాలని ఎప్పటినుంచో వుంది. కొన్నాళ్ళ తర్వాత స్పోర్ట్స్ డ్రామా చేస్తాను.
 
ఎఫ్4 ఎప్పుడు ?
డెఫినెట్ గా వుంటుంది. అయితే దానికి ఇంకా సమయం వుంది. 'సంక్రాంతికి వస్తున్నాం'ని కూడా ఫ్రాంచైజ్ చేసుకునే స్కోప్ వుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ