Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లో కథ చెప్పేసిన అనిల్ రావిపూడి - ప్రివ్యూ

venky, dilraju and team

డీవీ

, మంగళవారం, 7 జనవరి 2025 (07:53 IST)
venky, dilraju and team
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం'  సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ గ్రాండ్ ఈవెంట్ లో హీరో వెంకటేష్ స్టేజ్ పై డ్యాన్స్ చేయడం అభిమానులు ఉర్రూతలూగించింది.
 
కథేమిటంటే...
ఓ ఇన్ప్లూయన్స్ వున్న వ్యక్తిని కిడ్నాప్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది, దాని గురించి వార్తలు బయటికి వస్తే ప్రభుత్వమే కూలిపోతుంది. దినిని నుంచి గట్టెక్కించగల ఎక్స్ పర్ట్ ని ప్రభుత్వం ఆశ్రయిస్తుంది. వెంకటేష్ ఎక్స్ పోలీసు, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. అతని భార్య భాగ్యం (ఐశ్వర్య రాజేష్ )తో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ వుంటారు. వెంకటేష్ మాజీ ప్రియురాలు, పోలీసుగా ఉన్న మీనాక్షి చౌదరి కిడ్నాప్ కేసును ఛేదించడంలో సహాయం కోసం అతనిని సంప్రదించడంతో వారి ప్రశాంత జీవితానికి ఇబ్బంది కలుగుతుంది. వెంకటేష్ మిషన్‌ను చేపట్టడానికి అంగీకరిస్తాడు, అయితే భాగ్యం సపోర్ట్ తో అతను ఆపరేషన్‌లో భాగం కావాలని పట్టుబటతాడు.
 
దర్శకుడు అనిల్ రావిపూడి తన గత చిత్రం భగవంత్ కేసరిలో విలక్షణమైన ఎంటర్‌టైనర్ తో ఆకట్టుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాంతో  మరో సరికొత్త అనుభూతిని అందించారు. ట్రైలర్‌లో సూచించినట్లుగా ఈ చిత్రం ట్విస్ట్‌లు, థ్రిల్స్, యాక్షన్  డ్రామాను బ్లెండ్ చేస్తుంది. వెంకటేష్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ అందించారు, కామెడీ, ఫ్యామిలీ డైనమిక్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆదరగొట్టారు. ఐశ్వర్య రాజేష్ ఆదర్శ భార్యగా ఆకట్టుకుంది, మీనాక్షి చౌదరి వెంకటేష్ మాజీ ప్రేయసిగా, టఫ్  పోలీసుగా కథాంశానికి డెప్త్ జోడించారు. ఈ ట్రై యాంగిల్ రిలేషన్ కథకు ఆసక్తికరమైన డైనమిక్‌ని తెస్తుంది.
 
ట్రైలర్ ఫన్, యాక్షన్, సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా పర్ఫెక్ట్ మిక్స్. సాంకేతికంగా, విజువల్స్ అద్భుతంగా వుంది, సమీర్ రెడ్డి  అసాధారణమైన సినిమాటోగ్రఫీ,  భీమ్స్ సిసిరోలియో  పవర్ ఫుల్  స్కోర్ తో కట్టిపడేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నతంగా వున్నాయి. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు, స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ. యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ అందించారు. సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి  పర్ఫెక్ట్ ఛాయిస్, పండుగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తుంది. ఈ చిత్రం జనవరి 14, 2025న సంక్రాంతికి విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు