గేమ్ ఛేంజర్ ప్రి-రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటలకు ఆయనకు పాదాభివందనం చేయాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ... ''వకీల్ సాబ్ చిత్రం డబ్బింగ్ మూవీ అయినప్పటికీ పవన్ గారికి తగ్గట్లుగా కథను మార్చి తీయాలనుకున్నామనీ, ఆ విషయం ఆయనతో చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసాను. ఐతే ఆయన ఫంక్షనులో పబ్లిక్‌గా నేను ఇచ్చిన డబ్బులే జనసేన పార్టీకి ఇంధనంగా మారిందని చెప్పినప్పుడు నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అలా ఎవ్వరూ బయటకు చెప్పరు. అలాంటిది ప్రజల ముందు అలా చెప్పడాన్ని చూస్తే ఆయనకు పాదాభివందనం చేయాలి'' అని అన్నారు.
ఇంకా ఆయన చెబుతూ.. ''గబ్బర్ సింగ్ టైంలో పవన్ పాలిటిక్స్‌లోకి వెళుతున్నారు అని తెలిసింది. ఎందుకు ఈ టైమ్‌లో అని అడిగిన వారిలో నేనూ ఒకడిని. ఆయన రాజకీయాలకు వెళ్ళారు. సినిమాలు చేశారు, మళ్ళీ వెళ్ళారు, ఉమ్మడి ఎ.పి. విడిపోయాక కూడా ఆయనకు వర్కవుట్ కాలేదు. ఇప్పుడు వెళ్లారు. ఆయన కూటమిలో విజయం నాకు కనిపించింది. ఆయన గేమ్ ఛేంజర్‌లా కనిపించాడు. అప్పట్లో మనం ఫెయిల్యూర్ అయ్యామని ఆగిపోకుండా కళ్యాణ్ గారిని చూసి ఇన్ స్పైర్ అయి, కొత్త బాధ్యతలు వచ్చినా వాటినీ చూసుకుని నేను పయనిస్తున్నాను.'' అని అన్నారు.