Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలెంట్ ఉంటే ఫలితం లేదు... బిహేవియర్ ముఖ్యం .. చిరంజీవి డైరెక్ట్ పంచ్ (Video)

chiranjeevi

ఠాగూర్

, సోమవారం, 6 జనవరి 2025 (11:44 IST)
ఒక సినిమా నటుడుగా టాలెంట్ ఉందని కాలర్ ఎగరవేయడం ముఖ్యం కాదనీ, మన వ్యక్తిగత బిహేవియర్ ముఖ్యమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్‌ను ఉద్దేశించి పరోక్షంగా చేసినవేనని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
హైదరాబాద్ నగరంలో జరిగిన ఆప్తా (ఏపీటీఏ) క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇందాకటి నుంచి చాలా చెబుతూ నా అచీవ్‌మెంట్స్ గురించి చెప్పాను. అవును... పవన్ కల్యాణ్ నా అచీవ్‍మెంట్... రామ్ చరణ్ నా అచీవ్‌మెంట్. నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు నా అచీవ్‌మెంట్. వీళ్లందరినీ చూస్తుంటే ఇది కదా నేను సాధించాను అనిపిస్తుంది' అన్నారు. 
 
మొన్నామధ్య పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. అన్నయ్యా... నువ్వు ఒక మాట చెప్పేవాడివి... గుర్తుందా? అన్నాడు. మన ఇంట్లో ఇంతమంది హీరోలం ఉన్నాం... ఇది నాతోనే ఆగిపోకూడదు... మన ఫ్యామిలీ మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ అవ్వాలని చెప్పేవాడివి. రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో, మన మెగా ఫ్యామిలీ కూడా అలాగే ఉండాలని నువ్వు చెప్పావు. ఇవాళ ఆ మాట గుర్తుచేసుకుంటుంటే ఎంతో ఆనందం కలుగుతుంది... నీ మాట పవర్ అలాంటిది అన్నయ్యా... నువ్వు ఎంతో నిష్కల్మషంతో అంటావు, గొప్ప స్థిరచిత్తంతో అంటావు.... అందులో ఎలాంటి కపటం ఉండదు దానికి బలం ఎక్కువ అన్నయ్యా అని కల్యాణ్ బాబు అంటే... అవును కదా అనుకున్నాను.
 
ఈ విషయం తెలియకుండానే, ఓ పత్రిక మా గురించి రాస్తూ కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని పేర్కొంది. అప్పుడు... భగవంతుడా ఇది మా గొప్పదనం కాదు... నువ్వు, ఈ ప్రజలు, ఈ అభిమానులు, ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టే మేం ఈ స్థాయిలో ఉన్నాం అనిపిస్తుంది. గతంలో నేను ఏ సభలోనూ ఇంత మనసు విప్పి మాట్లాడలేదు. ఇంతమంది ఆప్తుల మధ్య ఆప్తా సంస్థ వాళ్లు ఆ అవకాశం ఇచ్చి నా గుండెను టచ్ చేశారు' అంటూ చిరంజీవి పేర్కొన్నారు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

A.R. Rahman పుట్టినరోజు.. బ్రయోగ్రఫీ ఏంటి.. అసలు పేరేంటి?