Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దిల్ రాజు అత్యవసర సమావేశంలో షాకింగ్ విషయాలు

Dil Raju

డీవీ

, సోమవారం, 6 జనవరి 2025 (11:02 IST)
Dil Raju
గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు కొద్దిసేపటిక్రితమే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కొన్నిషాకింగ్ విషయాలు చెప్పారు. రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పోలీసులు భారీ బందోబస్తు మధ్య పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసి బాగా ప్లాన్ చేశారు. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండని పవన్ కళ్యాణ్ కూడా అభిమానులను పదేపదే స్టేజీ మీద కోరారు. కానీ జరగాల్సిన నష్టం జరిగింది. ఈవెంట్ అయ్యాక తిరిగి వెళుతుండగా ఇద్దరు చనిపోయారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ, ప్రీ రిలీజ్ తర్వాత ఇంటికి తిరిగి వెళుతుండగా ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం. ఇప్పుడే తెలిసింది. అందుకే అత్యవసరంగా మీడియాతో మాట్లాడాలనిపించింది. ఇద్దరు వ్యక్తులు చనిపోయారని. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.  విషయం తెలిసి పవన్ కళ్యాన్ కూడా వాకబు చేసి వారి కుటుంబాలను కలవమని చెప్పారు. వారి కుటుంబాలకు చెరో 5లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను. తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తాను అని అన్నారు.
 
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ,  గబ్బర్ సింగ్ టైంలో పవన్  పాలిటిక్స్ లో వెళుతున్నారు అని తెలిసింది. ఎందుకు ఈ టైమ్ లో అని అడిగిన వారిలో నేనూ ఒకడిని. ఆయన రాజకీయాలకు వెళ్ళారు. సినిమాలు చేశారు .మళ్ళీ వెళ్ళారు. ఉమ్మడి ఎ.పి. విడిపోయాక కూడా ఆయనకు వర్కవుట్ కాలేదు. ఇప్పుడు వెళ్లారు. ఆయన కూటమిలో విజయం నాకు కనిపించింది. ఆయన గేమ్ ఛేంజర్ లా కనిపించాడు. అప్పట్లో మనం ఫెయిల్యూర్ అయ్యామని ఆగిపోకుండా కళ్యాణ్ గారిని చూసి ఇన్ స్పైర్ అయి, కొత్త బాధ్యతలు వచ్చినా వాటినీ చూసుకుని నేను పయనిస్తున్నాను.
 
సంక్రాంతి రిజల్ట్ తర్వాత మరోసారి సక్సెస్ మీటో ప్రేక్షకులకు మరిన్ని వివరాలు తెలియజేస్తాను. డిసెంబర్  18న ఎఫ్.డి.సి. చైర్మన్ ఛాన్స్ తీసుకుని వెంటనే అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఎ.పి.లో సినిమా టిక్కెట్ల రేట్ట గురించి తెలిసిందే. అలాగే తెలంగాణాలో రేవంత్ రెడ్డిగారిని కలవాలి. ఆయన సపోర్ట్ గా వుండమంటున్నారు. ఫార్మా, ఐటీ, సినిమా తెలంగాణాలొో కీలకం అన్నారు. మరలా ఆయన్సు కలిస్తే త్వరలో కలుస్తాను. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛాన్స్ వస్తే అకిరా నందన్‌తో ఖుషి 2 ప్లాన్ చేస్తా