Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

Advertiesment
Venky- Anil

డీవీ

, శనివారం, 28 సెప్టెంబరు 2024 (19:28 IST)
Venky- Anil
నేచురల్ స్టార్ నాని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అరుదైన ఘనతను సాధించారు, ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం 'దసరా'లో తన అద్భుతమైన నటనకు మూడు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.
 
ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు (తెలుగు), సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) అందుకున్న నాని ఇప్పుడు ⁠ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డు (IIFA) ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డు ని అందుకున్నారు. ఐఫాలో దసరా సినిమాకి గానూ ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత సుధాకర్ చెరుకూరి అందుకున్నారు.
 
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన 'దసరా' అద్భుతమైన కథాంశం, పెర్ఫార్మెన్స్ లతో ప్రశంసలు అందుకుంది. ధరణి పాత్రలో నాని ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫామెన్స్ తో విమర్శలు, ప్రేక్షకులని ప్రసంశలని పొందారు.
 
అవార్డ్ అందుకున్న సందర్భంగా నాని మాట్లాడుతూ.."దసరాకు లభించిన ప్రేమ, గౌరవం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ అవార్డులు మొత్తం నటీనటులు, టీం కృషి , అంకితభావానికి నిదర్శనం. అందరికీ కృతజ్ఞతలు' తెలిపారు.
 
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'భగవంత్ కేసరి' సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2023లో ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది.
 
ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి IIFAలో భగవంత్ కేసరి చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. ఎంటర్ టైన్మెన్, యాక్షన్ సినిమాలు చేసే అనిల్ రావిపూడి 'భగవంత్ కేసరి'లో అందరినీ సర్ ప్రైజ్ చేస్తూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాన్సెప్ట్ తో బిగ్ హిట్ కొట్టారు. గొప్ప కథాంశంతో విమర్శకులు, ప్రేక్షకులు ప్రసంశలు అందుకొని ఇప్పుడు IIFAలో ఉత్తమ దర్శకుడు అవార్డ్ ని అందుకున్నారు.
 
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన భగవంత్ కేసరి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లోని యూనిక్ ఎలిమెంట్స్ తో సీరియస్ సబ్జెక్ట్‌ను బ్లెండ్  చేయడం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎబులిటీకి నిదర్శనంగా నిలిచింది.
 
ప్రతిష్ఠాత్మక ఐఫా (IIFA-2024) అవార్డుల ఉత్సవం అబుదాబి వేదికగా ఘనంగా జరిగింది. హీరో తేజ సజ్జా, రానా  హోస్ట్ చేసిన ఈ వేడుక కన్నుల పండగగా సాగింది. ఈ వేడుకలో తేజ సజ్జా ఎనర్జిటిక్ హోస్టింగ్ సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది