Rajamouli : బాహుబలి ది ఎపిక్ తో సరికొత్త ఫార్మెట్ లో రాజమౌళి మార్కెటింగ్ సక్సెస్

చిత్రాసేన్
గురువారం, 16 అక్టోబరు 2025 (13:15 IST)
Bahubali Epic recored poster
బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో అందరి ద్రుష్టి ఆకర్షించిన దర్శకుడు రాజమౌళి ఆ సినిమా విడుదలయ్యాక రకరకాల ప్రకటనలు వ్యాపారాలతో నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాడు. పనిలో పనిగా ఆయనకూ ఎంతోకొంత ఫలితం దక్కుతుంది. తెలుగు సినిమా రంగంలో ఆయనకున్న ముందు చూపు హరెవరికీ లేదేమోనని చెప్పవచ్చు. తాజాగా మరోసారి బాహుబలి సినిమాను రీ రిలీజ్ చేయిస్తున్నారు.
 
2015 జులై 10న బాహుబలి విడుదలయితే, 28, ఏప్రిల్.. 2017లో బాహుబలి 2 విడుదలైంది. ఇక 2025.. అక్టోబర్ 31.. రెండు భాగాలు కలిపి 3డి, 4డి, ఫార్మెట్ విడుదలచేస్తూ ప్రేక్షకులకు థ్రిల్ కలుగజేయనున్నారు.
 
కాగా, ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. కనుక ఇదే నెలలో విడుదలచేయాలనేది ఆయన ప్లాన్. పురాణ కల్పిత ఫ్రాంచైజీలోని రెండు భాగాలు ఒక ఎపిక్ సినిమాటిక్ అనుభవంగా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్టోబర్ 31 నుండి ప్రపంచవ్యాప్తంగా సినిమాహాళ్లలో రాబోతున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ మామూలుగా లేవు.
 
బాహుబలి-ది ఎపిక్ యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది; ఇప్పటికే $60,000 దాటిందనేది సమాచారం. అంటే100 షోలలో దాదాపు 3,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి.ఇది అక్టోబర్ 29న యుఎస్‌లో ప్రీమియర్ అవుతుంది. BookMyShow లో 200K+ ఆసక్తులను దాటింది. ఈ చిత్రం పలు భాషలలో విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments