Rashmika : రష్మిక మందన్న ఫిల్మ్ మైసా కి స్టార్ కంపోజర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్

చిత్రాసేన్
గురువారం, 16 అక్టోబరు 2025 (12:17 IST)
Rashmika Mandanna - Maisa poster, Jakes Bejoy
రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న మైసా అనే పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్  మైసాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
మేకర్స్ ఒక ఇంట్రస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం ఫేం జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా జేక్స్ బిజోయ్ ట్రైబల్ వాయిద్యాలతో రీరికార్డింగ్ చేస్తున్న విడియో రిలీజ్ చేశారు. సౌండింగ్ అదిరిపోయింది. మైసా మ్యూజికల్ గా గ్రాండ్ స్కేల్ లో వుండబోతుంది.
 
మైసా గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతోంది. రష్మిక మందన్న ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవాతర్ లో కనిపిస్తుంది.
 
ఈ చిత్రానికి సూర్య ‘రెట్రో’ సినిమాకి పని చేసిన శ్రేయాస్ పి కృష్ణ డీవోపీగా పని చేస్తున్నారు. యాక్షన్ ని ‘కల్కి 2898 ఏ డీ’ ఫేమ్ ఆండి లాంగ్ డిజైన్ చేస్తున్నారు. మరిన్ని ఎక్సైటింగ్ అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments