OG Trend: ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఓజీతో నయా ప్లాట్‌ఫాం గ్రాండ్ ఎంట్రీ..

చిత్రాసేన్
గురువారం, 16 అక్టోబరు 2025 (12:06 IST)
Pawan Kalyan - OG
హీరో పవన్ కల్యాణ్ టైటిల్‌ రోల్‌లో న‌టించిన చిత్రం ఓజీ (OG). సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. కాగా పవన్ కల్యాణ్ ఓజీతో భాగ‌స్వామ్యం అయిన OnceMore.io గ్లోబ‌ల్‌టెక్నాల‌జీ, వినోద రంగంలో కార్డును బ‌ద్ద‌లు కొట్టి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచింది. 
 
ఈ ఆన్‌లైన్ (కంటెంట్ బేస్‌డ్ వెబ్‌సైట్‌, ప్లాట్‌ఫాం) ప్లాట్‌ఫాం పాన్ ఇండియా గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా ఓజీతో భాగస్వామ్య‌మై ఖాతా ఓపెన్ చేసిన 42 గంట‌ల్లోనే 60 దేశాల్లో 1మిలియ‌న్ యూజ‌ర్స్ చేరిపోయాయి. దీంతో గ్లోబ‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయిన చాట్ జీపీటీ, టిక్‌టాక్‌, స్పోటిఫై లాంటి దిగ్గ‌జ ప్లాట్‌ఫాంల‌ను బీట్ చేసి మ‌రి ఈ ఘ‌న‌త సాధించిన ఇండిపెండెంట్ ప్లాట్‌ఫాంగా నిలిచింది.
 
సినిమా విడుదలకు ముందు డైరెక్ట‌ర్‌ సుజీత్ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ప్రత్యేకమైన సినిమా కంటెంట్‌ను విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా రావాలని అభిమానులను వెబ్‌సైట్‌కు ఆహ్వానించాడు. ఏఐ టెక్నాలజీతో ఎంట‌ర్‌టైనింగ్ ఇంట‌రాక్ష‌న్ సెష‌న్‌లో కొత్త ర‌క‌మైన ప‌ద్ద‌తిలో మూవీ ల‌వ‌ర్స్‌లో ఎంగేజ్ కానుంది. ఇప్ప‌టికే మ‌రో పాన్ ఇండియా సినిమాతో పార్ట్‌న‌ర్‌షిప్ కుదుర్చుకుంద‌ట‌. మ‌రి రాబోయే రోజుల్లో నయా కంటెంట్‌తో నెటిజ‌న్లు, మూవీ ల‌వ‌ర్స్‌కు క్రేజీ అప్‌డేట్స్ అందించనుంద‌న్న మాట‌.
 
ఓజీలో గ్యాంగ్ లీడర్‌ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్‌ లీడ్ రోల్‌లో నటించింది. ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

కాపురంలో కలహాలు.. సినీ ఫక్కీలో భార్య స్కెచ్.. అదృష్టం బాగుండి భర్త..?

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments