Vijay Deverakonda, Director Rahul Sankrityan
హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వీడీ 14. ఈ క్రేజీ మూవీ గురించి డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ చెప్పిన మాటలు మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా డ్యూడ్ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన రాహుల్ మాట్లాడుతూ.."వీడీ 14"లో విజయ్ పర్ ఫార్మెన్స్ చూస్తే షాక్ అవుతారని, ఆయన నట విశ్వరూపం ఈ చిత్రంలో చూస్తారని అన్నారు. డైరెక్టర్ చెప్పిన ఈ మాటలతో "వీడీ 14" ఎంత స్ట్రాంగ్ కంటెంట్, ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ లతో తెరకెక్కుతోందో తెలుస్తోంది.
బ్రిటీష్ కాలం నేపథ్యంతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వీడీ 14 నిర్మాణవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా వీడీ 14 ప్రేక్షకుల ముందుకు రానుంది.