NTR's connection with the film Samrajyam
సామ్రాజ్యం సరిహద్దులు దాటి పెరుగుతుంది.. అంటూ ఎన్.టి.ఆర్. పోస్టర్ తో చిత్ర టీమ్ విడుదల చేసింది. ఆక్టోబర్ 17 శుక్రవారం ఉదయం 10 గంటల 7 నిమిషాలకి రానుంది అంటూ తెలియజేసింది. సామ్రాజ్యం అంటే కింగ్ డమ్. ఈ సినిమాను విజయ్ దేవరకొండ చేశారు. ఆ సినిమాకు ఎన్.టి.ఆర్. వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎన్టీఆర్ గొంతుతో ఏదన్నా గ్లింప్స్, టీజర్ వస్తే వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు తెలుగు సినిమా దాటి పరబాషా సినిమాకూ ఆయన అవసరం ఏర్పడింది.
తాజాగా అభిమానులకు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. సామ్రాజ్యం అనే సినిమా కోసం తారక్ తన వాయిస్ ఓవర్ అందించనున్నట్టుగా ప్రకటించారు. విజయ్ దేవరకొండ.. కింగ్డమ్ చిత్రానికి అనుకున్న టైటిల్స్ లో సామ్రాజ్యం కూడా వుంది. అందుకే హిందీలో సామ్రాజ్య పెట్టారు. అదే పేరున్న సినిమాకు ఎన్.టి.ఆర్. అవసరం రావడం విశేషమనే చెప్పాలి.
అయితే సామ్రాజ్యం సినిమా కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ చేసే చిత్రం. హీరో శింబు కలయికలో అనౌన్స్ చేసిన సినిమా పేరు అర్సన్. దానికి తెలుగు వర్షన్ సామ్రాజ్యం. మరి ఎన్.టి.ఆర్. వాయిస్ ఓవర్ తో రాబోతున్న ఈ సినిమా ఏమేరకు హెల్ప్ అవుతుందో చూడాలి. తాజాగా ఎన్.టి.ఆర్. ఇటీవలే నటించిన హిందీ సినిమా వార్2 ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. తాజాగా డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో వుంది.
డ్రాగన్ చిత్రంలో రుక్మిణి వసంత్ నాయిక కాగా, టోవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిషబ్ శెట్టి అతిథి పాత్రలో కనిపించవచ్చని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదల కానుంది.