Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sidhu Jonnalagadda : తెలుసు కదా.. చేయడం చాలా బాధగా ఉంది, ఇకపై గుడ్ బై : సిద్ధు జొన్నలగడ్డ

Advertiesment
Telusu Kadaa - Sidhu Jonnalagadda

చిత్రాసేన్

, గురువారం, 16 అక్టోబరు 2025 (10:58 IST)
Telusu Kadaa - Sidhu Jonnalagadda
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం తెలుసు కదా. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. నీరజా కోన దర్శకత్వంలో టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ తర్వాత జరిగిన పరిణామాలవల్ల సోషల్ మీడియాలో హీరోను టార్గెట్ చేశారు. దానికి గతరాత్రి పలు వివరణలు ఇచ్చుకున్నారు.
 
సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ఈరోజు చాలా బాధగా ఉంది. ఒక ఏడాదిగా చాలా రాడికల్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఒక వింత మనిషి బుర్రలో బతుకుతున్నాను. ఎల్లుండి సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో చేసిన వరుణ్ అనే క్యారెక్టర్ కి గుడ్ బై చెప్పేయాలి. నేను ఎందుకు ఆ క్యారెక్టర్ గురించి అంత పర్టికులర్ గా చెప్తున్నాను అంటే సినిమా చూస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అందుకే లాస్ట్ టైం  వరుణ్ లాగా ఉందామనుకుంటున్నాను. అందుకే తన దగ్గరికి వెళ్లి తన షర్ట్ కూడా తీసుకొచ్చాను. వరుణ్ క్యారెక్టర్ కి గుడ్ బై చెప్పడం నిజంగా బాధగా ఉంది.
 
వరుణ్ నాకు రెండు కండిషన్స్ పెట్టాడు. ఇక్కడున్న ఆడపిల్లలు అందరితో మాట్లాడమన్నాడు. అమ్మాయిలతోనే సృష్టి మొదలైంది. మేము మీ ముందు చాలా నిమిత్త మాత్రులం. మేము ఏదైనా చిన్న తప్పు చేసినా మీరు పెద్దమనుసు చేసి క్షమించేయాలి. మీరు గొప్ప మేము గొప్ప అని డిస్కషన్ లేదు. మీరే గొప్ప. మీ వల్ల మేము గొప్ప. ఇప్పుడు బాయ్స్ తో మాట్లాడదాం. ఎప్పుడైనా ఒక అమ్మాయి మీ మనసు విరగ్గొట్టి వెళ్లిపోతే వెళ్లిపోనివ్వండి. లేదు అలా కాదు ఆమె వెంట పడితే మాత్రం మీ మీద మీకున్న మర్యాద పోతుంది. అబ్బాయిలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరెస్టులో ఉండాలి. మనసు విరుగుతుంది, బాధేస్తుంది. రానివ్వండి. అసలు కథ అక్కడే మొదలవుతుంది. 
 
అప్పుడు వరుణ్ లాంటివాడు మీ నుంచి బయటకు వస్తాడు.  మన ఎమోషన్స్  మన కంట్రోల్ లో ఉండాలని అర్థమవుతుంది. పవర్  కంట్రోల్  మనసులో మెయింటైన్ అవ్వాలి. ఇంకేమైనా డౌట్లు మిగిలిపోయి ఉంటే అక్టోబర్ 17న థియేటర్స్ కి వచ్చి తెలుసు కదా సినిమా చూడండి. ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టర్ ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వైలెన్స్ ని జనరేట్ చేస్తాడు. అది నా ప్రామిస్ .బెర్ముడా ట్రయాంగిల్ మీద నుంచి షిప్ వెళ్లిన ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళినా దానిలోకి లాగేసుకుంటుంది. తెలుసు కదా కూడా అలాంటి లవ్ ట్రయాంగిల్. ఈ సినిమా చూసిన వాళ్ళందరినీ కూడా అది లాగేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్