నేనేమో భారత్‌కు ప్రధాని.. మా ఆయన అమెరికాకు అధ్యక్షుడు.. ప్రియాంక చోప్రా

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (19:02 IST)
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా.. తాజాగా హాలీవుడ్ ఇంటి కోడలు అయ్యింది. క్వాంటికో సిరీస్‌లో నటించి మంచి పేరు కొట్టేసింది. ఆపై అమెరికా పాప్ సింగర్ నిక్ జోన్స్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం అమెరికాలోనే సెటిలైపోయింది. తాజాగా ఓ లండన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా తన మనసులోని మాటను బయటపెట్టింది. 
 
ఈ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్తులో తాను భారత దేశ ప్రధాన మంత్రి కావాలనుకుంటున్నానని చెప్పింది. అంతటితో ఆగకుండా తన భర్త జోన్స్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నానని.. నిక్ అమెరికా అధ్యక్షుడు కావాలని చెప్పింది. ''నేను భారత ప్రధాని.. మా ఆయన అమెరికా అధ్యక్షుడు కావాలి'' అంటూ వెల్లడించింది. 
 
రాజకీయాల్లో ఇంతవరకు తాను ఆసక్తి చూపెట్టలేదు. అయితే ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావాలని తాను భావిస్తున్నట్లు ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. గట్టిగా నమ్మితే అనుకున్నది సాధించవచ్చుననేదే తన అభిప్రాయం. తన భర్త నికో జోన్స్ కూడా సమర్థవంతమైన నాయకుడిగా ఎదుగుతాడని ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూలో ఆకాంక్షించింది. 
 
ప్రస్తుతానికి సినిమారంగంలో అదరగొడుతున్న ప్రియాంక చోప్రా, ఆరోగ్యం, విద్య, మహిళల హక్కులపై ప్రజల్లో చైతన్యాన్ని నింపే కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments