Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందమైన ఎంపీకి పెళ్లి కాబోతోంది.. ఆమె ఎవరో తెలుసా?

Advertiesment
అందమైన ఎంపీకి పెళ్లి కాబోతోంది.. ఆమె ఎవరో తెలుసా?
, బుధవారం, 29 మే 2019 (13:05 IST)
తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున సినీతార నస్రత్ జహాన్ ఎంపికైంది. లోక్‌సభలో మోస్ట్ గ్లామరస్ ఎంపీగా ఆమె పేరు కొట్టేసింది. సోషల్ మీడియాలో ఆమెకున్న పేరు.. ఫాలోవర్స్ ఎక్కువే. 
 
ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే వివాహం చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. తన ఎన్నో గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకునే నస్రత్, త్వరలోనే కోల్ కతాకే చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను వివాహం చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. తన పెళ్లి గురించిన విషయాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 
 
తాను స్వతహాగా ముస్లింనని.. అయినప్పటికీ అన్నివర్గాల వారు తనకు ఓటేశారని.. తద్వారా తనకు ఓటర్ల నుంచి ఘన స్వాగతం లభించిందన్నారు. తాను మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొందానని చెప్పుకొచ్చారు. తన తొలి ఓటును 18వ ఏట ఆమెకే వేశానని సుస్రత్ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ కార్యకర్తను పరుగెత్తించి కత్తులతో నరికి చంపారు...