Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ భార్యతో రామ్ గోపాల్ వర్మకు మూడిందా? (Video)

Webdunia
గురువారం, 16 జులై 2020 (12:47 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మూడిందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత జరిగిన తతంగాన్ని సినిమాగా తీస్తున్నాడు వర్మ.

అంతేగాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తూ సినిమా చేస్తున్నాడు. పవర్ స్టార్ టైటిల్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ వాటికి సంబందించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేసి సినిమా మీద హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు. 
 
ప్రస్తుతం వర్మ రిలీజ్ చేసిన పోస్టర్లు తన వ్యక్తిగత ఇమేజ్‌ని అవమానించే విధంగా వున్నాయని.. పవర్ స్టార్ సతీమణి అన్నా లేజీనోవా కోర్టులో కేసు వేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ సినిమా తనని, తన భర్తని కించపరిచే విధంగా ఉందని ఆమె భావించి పవన్ కళ్యాణ్ నిర్ణయంతో కోర్టులో కేసు వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే వర్మకు మూడినట్టేనని సినీ జనం అనుకుంటున్నారు. 
 
ఇకపోతే.. లాక్ డౌన్‌ నేపథ్యంలో అందరూ సినిమాలు మానేసి ఇంట్లో కూర్చుంటే .. వర్మ మాత్రం ఒక డిజిటల్ థియేటర్ స్టార్ట్ చేసి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా థ్రిల్లర్ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు.

చాలా రోజుల క్రితం పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' సినిమా, ఆ తర్వాత ఇటీవలే అదే పోర్న్ భామతో 'క్లైమాక్స్' సినిమాలు తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఆపై తెలుగమ్మాయి శ్రీ రాపాకతో హాట్ మూవీ 'నగ్నం' అనే మూవీతో యూత్‌ను బాగానే ఆకట్టుకున్నాడు. 
 
ఇక ఇప్పుడు ఒడిశా బ్యూటీ అప్సరా రాణి అందాలతో థ్రిల్ చేయాలని 'థ్రిల్లర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమాల ద్వారా ఇప్పటికే మంచిగా సంపాదించేశాడని సినీ పండితులు చెప్తున్నారు. ఇక పవర్ స్టార్ సినిమాతో ఎంత సంపాదిస్తాడో వేచి చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం