Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరిది వరుసయ్యే వ్యక్తితో లింకు.. ప్రియుడితో కలిసి భర్త హత్య

Advertiesment
మరిది వరుసయ్యే వ్యక్తితో లింకు.. ప్రియుడితో కలిసి భర్త హత్య
, బుధవారం, 15 జులై 2020 (18:43 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి నిర్దాక్షిణ్యంగా హత్యచేసిందో భార్య. ఈ దారుణ ఘటన వికారాబాద్‌ జిల్లా అనంతగిరి అడవుల్లో సోమవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన బైండ్ల చెన్నయ్య(38) - శశికళ అనే దంపతులు ఉండగా, వీరికి ఇద్దరు పిల్లలు. చెన్నయ్య కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో శశికళ.. అదే గ్రామానికి చెందిన మరిది వరుసయ్యే రమేశ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ లింక గత ఆరేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. 
 
ఈ క్రమంలో వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని ఆలోచించి నెల రోజులుగా అతడి హత్యకు ప్రియుడితో కలిసి పథకం వేసింది. ఈనెల 6న అనంతగిరిలో తాగుడు మానేందుకు చెట్ల మందు పోస్తున్నారని భర్తను నమ్మించి, చెన్నయ్యను శశికళ, రమేష్‌లు కలిసి తమ వెంట తీసుకుని వెళ్లారు. 
 
ఆ తర్వాత అనంతగిరి అడవిలో పూటుగా చెన్నయ్యకు మద్యం తాగించిన రమేష్... లోయలోకి తోసేశారు. ఆ తర్వాత పెద్ద బండరాయితో తలపై మోది చంపేశారు. మృతదేహం ఎవరికీ కనిపించకుండా చెట్ల పొదలను వేసి ఇంటికి చేరుకున్నారు. 
 
ఈ క్రమంలో చెన్నయ్య తల్లి అనారోగ్యం కారణంగా కన్నుమూసింది. తల్లి అంత్యక్రియలకు ఒక్కగానొక్క కుమారుడైన చెన్నయ్య రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు అనుమానం వచ్చి, శశికళను అడుగగా, తనకేం తెలియదని సమాధానం ఇచ్చింది. అయితే, రమేష్‌తో శశికళకు అక్రమ సంబంధం ఉందనే విషయం గ్రామస్తులకు తెలుసు. 
 
అందుకే గ్రామ సర్పంచ్ సమక్షంలో రమేష్‌ను నిలదీయగా, అసలు విషయం వెల్లడించారు. తాను చేసిన తప్పు బయటకు రావడంతో శశికళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. చెన్నయ్యను హత్య చేసినందుకు శశికళతో పాటు.. రమేష్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది పురుగు కాదు.. పువ్వు.. వీడియో చూస్తే మీరే షాకవుతారు.. (Video)