దేశంలో రోజురోజుకు కరోనా పెరిగి పోతున్నది. ఇది సినిమా సెలబ్రిటీలను సైతం పట్టుకుంటోంది. కన్నడ హీరో ధృవ సర్జా కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలు కనబడటంతో టెస్టులు నిర్వహించారు. ఈ రిపోర్టులో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయనతోపాటు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇద్దరూ వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు.
ధృవ సర్జా ఎవరో కాదు.. యాక్షన్ హీరో అర్జున్ మేనల్లుడు. అంతేకాకుండా ఒక నెల క్రితం గుండెపోటుతో మరణించిన చరంజీవి సర్జాకి తమ్ముడు. ధృవ సర్జాకి కరోనా సోకడంతో కన్నడ చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఇటీవల రోజుల్లో తమతో కాంటాక్టులో వున్నవారందరిని కరోనా పరీక్ష చేయించుకోమన్నారు ధృవ సర్జా.