Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వయంభూ కోసం వియత్నామ్ లో కఠిన శిక్షణ తీసుకోనున్న నిఖిల్

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (18:19 IST)
Nikhil-Swayambhu
హీరో నిఖిల్ సిద్ధార్థ సినిమాల కోసం తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కంఫర్ట్ జోన్ లో కాకుండా ఛాలెంజింగ్ పాత్రలను పోషించడానికి ఇష్టపడతారు. నిఖిల్ తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ‘ కోసం కఠినమైన శిక్షణను పొందబోతున్నారు.
 
యుద్ధం నేపధ్యంలో వుండే చిత్రాల కోసం ఒక నటుడు పూర్తి ప్రొఫెషనల్‌గా ఉండాలి. అన్నిరకాల  పోరాట నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. ‘స్వయంభూ’ లో ఒక యోధునిగా కనిపించడానికి నిఖిల్ ఒక నెల రోజుల పాటు కఠినమైన శిక్షణ కోసం వియత్నాం వెళ్లారు. ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు నిఖిల్. సైగాన్‌లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్‌లు, టీమ్స్..  యూనిట్లో భాగంగా వుండి, స్వయంభూ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్ కి శిక్షణ ఇస్తారు.
 
అలాగే నిఖిల్ ఫిజికల్ మేకోవర్ కూడా అవుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో ఒక లెజెండరీ యోధుడిగా కనిపించారు. ఇప్పటి వరకు నిఖిల్‌కి ఇది చాలా ఛాలెంజింగ్ రోల్.
 
భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  నిఖిల్‌కు ఇది మైల్ స్టోన్ 20 వ చిత్రం మరియు తన కెరీర్ లో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ మూవీ. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
‘స్వయంభూ’ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments