Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిఖిల్, భరత్ కృష్ణమాచారి కాంబినేషన్లో స్వయంభు షూటింగ్ బిగిన్స్

Advertiesment
Swayambhu look
, శుక్రవారం, 18 ఆగస్టు 2023 (15:09 IST)
Swayambhu look
'కార్తికేయ 2' చిత్రంతో దేశవ్యాప్తంగా ఫేం సంపాదించిన హీరో నిఖిల్ తన మైల్ స్టోన్ 20వ సినిమా కోసం దర్శకుడు భరత్ కృష్ణమాచారితో జతకట్టారు. 'స్వయంభు' టైటిల్ తో ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై  భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్వయంభు టైటిల్ క్యూరియాసిటీని పెంచగా, పవిత్రమైనసెంగోల్‌ను చూపించే టైటిల్ పోస్టర్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి ఆసక్తి కలిగించింది. నిఖిల్‌ను ఫెరోషియస్ వారియర్ గా చూపించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
 
webdunia
nikl, Samyukta Menon, aravind
శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా మేకర్స్ గ్రాండ్ లాంచింగ్ వేడుకను నిర్వహించారు. చిత్రబృందం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. చదలవాడ శ్రీనివాసరావు స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, సితార నాగవంశీ, దామోదర్ ప్రసాద్ హాజరయ్యారు.
 
 సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. నిఖిల్ యోధుడిగా గుర్రపు స్వారీ చేస్తూ డ్రాగన్‌పై బాణం వేస్తున్నట్లు కనిపించిన స్టప్‌ఫైయింగ్ పోస్టర్ ద్వారా అనౌన్స్ మెంట్ చేశారు. మునుపెన్నడూ చూడని పాత్రలో నిఖిల్ కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లాగే ఈ కొత్త పోస్టర్  నెక్స్ట్ లెవల్ లో వుంది.
 ఈ మూవీలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది.
 
స్వయంభు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతుంది. రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోహెల్ చేసిన మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ ఎలా ఉందంటే ! రివ్యూ