Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచి చిత్రాలు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా: స్పై హీరో నిఖిల్

Nikhil, K Rajasekhar Reddy, Charan Tej Uppalapati, Aishwarya Menon
, శుక్రవారం, 30 జూన్ 2023 (19:10 IST)
Nikhil, K Rajasekhar Reddy, Charan Tej Uppalapati, Aishwarya Menon
నిఖిల్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేషనల్ థ్రిల్లర్ ‘స్పై'. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని చ‌ర‌ణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయిక గా నటించింది. నిన్న (జూన్ 29) విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, నిఖిల్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్(11.7cr) తో నేషన్‌ వైడ్ బ్లాక్‌ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
 
నిఖిల్ మాట్లాడుతూ..‘స్పై’ సినిమాకి వరల్డ్ వైడ్ యునానిమస్ గా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమాని ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.  నా కెరీర్ ని మరో మెట్టు పై కి ఎక్కిస్తూ ఓపెనింగ్స్ కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుముందు మరిన్ని మంచి చిత్రాలు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. దర్శకుడు గ్యారీ సినిమాని చాలా  కొత్తగా రిచ్ గా ప్రజెంట్ చేశారు. సినిమా చూసిన ప్రేక్షకులంతా మంచి సినిమా అందించామని అభినందిస్తున్నారు. ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీచరణ్ నేపధ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. స్పై చాలా రిచ్  ఫిల్మ్. ఫన్, ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి అన్నీ వున్నాయి. ఈ వీకెండ్ కి మంచి సినిమా చుశామనే అనుభూతి ఇస్తుంది. ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ తెలిపారు
 
చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ.. పబ్లిక్ టాక్ అద్భుతంగా వుంది. ప్రేక్షకులు చాలా ఇష్టపడుతున్నారు. కామెడీ, యాక్షన్ అన్నీ ఎలిమెంట్స్ చక్కగా వర్క్ అవుట్ అయ్యాయి. నిఖిల్, గ్యారీ, ఐశ్వర్య అందరికీ థాంక్స్. ఇంత బిగ్ ఓపెనింగ్ రావడం ఆనందంగా వుంది. ఆల్రెడీ యాభై శాతం రికవరీ అయిపోయారు. డిస్ట్రిబ్యుటర్స్ కాల్ చేసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు
 
 గ్యారీ బిహెచ్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమాని ఇంకా బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’మ అన్నారు.
 
ఐశ్వర్య మీనన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా వుంది. ప్రేక్షకుల రియాక్షన్ చూసినప్పుడు చాలా ఆనందంగా వుంది.  తెలుగులో  చేసిన మొదటి సినిమా ఇంతపెద్ద విజయం సాధించడం ఆనందంగా వుంది’’ అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.36 కోట్లకు అమ్ముడైన షారూక్ ఖాన్ జవాన్ మ్యూజిక్‌ రైట్స్‌