Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అర్థం కాని మరో ఆదిరుపుష్‌ నిఖిల్‌ స్పై ` రివ్యూ రిపోర్ట్‌

Spy poster
, గురువారం, 29 జూన్ 2023 (12:38 IST)
Spy poster
సినిమాలను సినిమాగా చూడాలని ఆదిపురుష్‌ సినిమా చూసిన తర్వాత వచ్చిన స్పందనను బట్టి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమాను సినిమాగానే తీయాలి. ఒరిజినల్‌ కథను మార్చి తీయకూడదనే లాజిక్‌ తెలిసినా తీస్తే ఏమనాలో అంటూ ఆయనకు కౌంటర్‌లు బాగానే పడ్డాయి. ఇప్పుడు స్పై సినిమా కూడా చూస్తే అలానే అనిపిస్తుంది. కార్తికేయ2తో పాన్‌ ఇండియా లెవల్‌కు వెళ్లిన నిఖిల్‌ సిద్దార్థ ఈసారి స్పై అనే రా ఏజెంట్‌ పాత్ర పోషించాడు. ట్రైలర్‌లో అజాద్‌ హింద్‌ పౌజ్‌ స్థాపకుడు సుభాష్‌ చంద్రబోస్‌ రహస్యాల గురించి సినిమా అనే  విషయం  బయట పెట్టాడు. ఏమిటా రహస్యాలు? అని అడిగితే సినిమా చూసి తెలుసుకోండి అన్నారు. మరి ఈరోజే విడుదలైన స్పై సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
ఖాదిర్‌ (నితిన్‌ మెహ్రా) ఆయుధాలు సప్లయి చేసే ఏజెంట్‌. అతన్ని రా టీమ్‌ శాటిలైట్‌ ద్వారా రహస్య ఆపరేషన్‌ చేసి పట్టుకుని వధిస్తుంది. రా టీమ్‌లోని ఆర్యన్‌ రాజేష్‌ అతన్ని పాయింట్‌ బ్లాక్‌లో పెట్టి చంపేస్తాడు. కానీ ఆ వెంటనే రాజేష్‌ను ఎవరో చంపేస్తారు. కట్‌ చేస్తే, కొద్దిసేపటికి నన్ను చంపడం అంత ఈజీగాకాదు. నేను బతికేవున్నా. దాని మూల్యం ఇండియాపై భారీగా వుంటుందని వీడియోటేప్‌ వదులుతాడు. దానికి హోం మంత్రి, ప్రధాన మంత్రి రా చీఫ్‌ శర్మను ఎలెర్ట్‌ చేయమని చెబతారు. 
నిఖిల్‌ రా ఏజెంట్‌. శ్రీలంక సముద్ర తీరంలో పట్టుబడిన జాలరిగా కనిపిస్తాడు. అక్కడ వీరిచేత అక్రమ ఆయుధాలు సరఫరాచేసే ఓ డాన్‌ తో రా టీంతో నిఖిల్ పోరాటం చేస్తాడు. ఆ తర్వాత రా చీఫ్ శర్మ చెప్పిన కొత్త ఆపరేషన్ లో భాగంగా తన అన్న ఆర్యన్‌ రాజేష్‌ను ఎవరు చంపారనే కోణంలో నిఖిల్ ముగ్గురు టీమ్‌తో ఇండియాలో పలు ప్రాంతాలు పర్యటిస్తాడు. అక్కడ స్మగ్లర్‌ ఖదీర్‌కు అండగా వున్నది రా సభ్యుల్లో ఒకరని తెలుస్తుంది. ఆ తర్వాత తన చేసే ఆపరేషన్‌లో భాగంగా దొరికిన ఖదీర్‌ను చంపకుండా అతని పక్కన వ్ను రా ఏజెంట్‌ను నిఖిల్‌ చంపేస్తాడు. దాంతో నిఖిల్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ అవుతుంది. అయినా సరే తను అనుకున్న గోల్‌ కోసం సుభాష్‌చంద్రబోస్‌ రాసిన పత్రాలు ఖాదీర్ ఎందుకు దొంగిలించాడు ? అనే కోణంలో కనిపెట్టాలని సొంతంగా ప్లాన్‌ చేస్తాడు. అందుకు రానా సపోర్ట్‌ తీసుకుంటాడు? ఆ తర్వాత తను ఏమి చేశాడనేది కథ.
 
సమీక్ష
సినిమా చూశాక కథగా చెప్పాలంటే కొంచెం కష్టమే. సినిమాతీస్తే అర్థం పరమార్థం వుండాలంటారు. ప్రేక్షకులకు అర్థంకావాలి. చిత్ర యూనిట్‌కు పరమార్థం కావాలి. ఎందుకనే మొదటిది వదిలేశారు.. తమకు అర్థమయితే చాలనుకున్నట్లుంది దర్శకుడు గ్యారీ. అసలు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం అనేది ఎవర్‌గ్రీన్‌ రహస్యమే. అప్పటి ప్రభుత్వాధినేతలుకానీ, ఆయన పుట్టిన రాష్ట్రంలోని వారికికానీ ఇప్పటి ప్రభుత్వాలకు కానీ అర్థంకానిది అది. దాన్ని రా ఆపరేషన్‌ను లింక్‌ చేస్తూ చేయడం విడ్దూరమనే అని చెప్పాలి. 
 
ఇప్పటికే రా ఏజెంట్‌ సినిమాలు చాలానే వచ్చాయి. అన్నీ టెర్రరిజం, రహస్యాలను ఛేదించేవిధంగా వుండేలా ట్రై చేశారు. హాలీవుడ్‌లో జేమ్స్‌బాండ్‌ సినిమాలు వచ్చాయి. ఇది ఆ తరహాకథతో కూడింది. ఇలాంటి సినిమా తీయాలంటే హీరో ఆహార్యంకూడా చూసుకోవాలి. ఇక మొదటి భాగం చూశాక సినిమా ఏమిటో ఎవరికీ అర్థంకాదు. రెండో భాగం చూశాక సినిమా ఎందుకు తీశారో తెలీదు. 
 
ఈ సినిమాలో ఓ డైలాగ్‌ వుంటుంది. చరిత్ర నిజం చెప్పదు. దాస్తుంది. దాన్ని మనం ఛేదించాలి. అని రా చీఫ్‌ శర్మ ఏజెంట్లకు చెబుతాడు. స్వాతంత్య్రానికి ముందు అజాద్‌ హిందూ ఫౌజ్‌ అనేది స్థాపించిన చంద్రబోస్‌ అన్ని ప్రాంతాలను పర్యటించి, నా కోసం రక్తం చిందిస్తే నేను మీకు ఫ్రీడమ్‌ ఇస్తానంటూ.. స్లోగన్‌ ఇస్తాడు. దానికి ప్రేరేపితమైన సామాన్యులు అజాద్‌ హిందూ ఫౌజ్‌లో చేరి స్వాతంత్య్రం కోసం పోరాడతారు. ఆ క్రమంలో కోహిమ ప్రాంతానికి రావడంతో యుద్ధం జరుగుతుంది. అక్కడినుంచి బోస్‌ కనిపించడు. అక్కడే చనిపోయారని చరిత్రలో వుంది. కానీ దాని వెనుక ఎవరిదో హస్తం వుందనేది పుస్తకాల్లో వుంది. దానికితోడు నెహ్రూ, గాంధీలను కూడా తప్పు పటలేం అని కూడా ఓ డైలాగ్‌ హీరో చెబుతాడు. మరి ఎవరిని తప్పుపట్టాలి. అసలు భారత్‌కు ప్రీడమ్‌ వచ్చింది కేవలం బాటిల్‌ ఆఫ్‌ కొహిమా వల్లే. కానీ బ్రిటీష్‌ అది అంగీకరించక గాంధీ సామరస్య పోరాటం వల్ల ఇచ్చామనేది ప్రకటించినట్లు చరిత్రలో వుంది. సీరియస్ పాయింట్‌ను లైటర్‌ వేలో చెప్పేశారు.
 
ఇక హీరో రా ఏజెంట్‌గా శత్రువుల దగ్గరకు ఈజీగా వెళ్ళడం, వారిని గన్స్‌తో ఎటాక్‌ చేయడం సాహసాలు చేయడం చకచకా జరిగిపోతాయి. ఇందులో అభినవ్‌ గోమటం కామెడీ పీస్‌. ఐశ్వర్య మీనన్‌, సన్యాఠాగూర్‌లు ఏజెంట్‌లుగా నటించారు. తనికెళ్ళ భరణి నిఖిల్‌ పాదర్‌గా నటించాడు. ఇక శ్రీచరణ్‌ పాకాల నేపథ్యం సంగీతం ఓకే. వంశీ పచ్చిపులుసు కెమెరా పర్వాలేదు.
 
ఫైనల్‌గా ఈ సినిమాలో ఓ డైలాగ్‌ వుంటుంది. హీరో కష్టపడి బోస్‌ రాసిన రహస్య పత్రాలు సంపాదిస్తాడు. అందులో ఏముందని గోముఖం అంటే.. అది తెలియకపోవడమే మంచిది అంటాడు. మరి ఇంత గొడవదేనికి అనేలోపలా.. కజికిస్తాన్‌ వెళదాం అంటూ తీసుకెళతాడు దాంతో  శుభంకార్డ్‌ పడుతుంది. 
 
ఫైనల్‌గా ఈ సినిమా చూశాక బయటకు వచ్చే ప్రేక్షకులు ఫీలింగ్‌ ఏమంటే.. మొన్న ఆదిపురుష్‌ అర్థంకాలేదు. ఇప్పుడు స్పై అంతకన్నా దారుణంగా వుందని..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ మృతి.. పోలీసులు ఏమన్నారంటే?