Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పై టీజర్ న్యూఢిల్లీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కర్తవ్య పథ్ వద్ద విడుదల

Spy Teaser Released
, మంగళవారం, 16 మే 2023 (09:52 IST)
Spy Teaser Released
సుభాష్ చంద్రబోస్ జీవితం వెనుక దాగిన రహస్యాలు ఆధారంగా రూపొందిన నిఖిల్ నేషనల్ థ్రిల్లర్  ‘స్పై టీజర్ ఈ రోజు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ (రాజ్‌పథ్) లో విడుదల చేశారు. ఈ ఐకానిక్ ల్యాండ్‌ మార్క్‌ లో లాంచ్ అయిన మొదటి సినిమా టీజర్  స్పై కావడం విశేషం.
 
భగవాన్ జీ ఫైల్స్ గురించి మకరంద్ దేశ్‌ పాండే తన టీం కి వివరించడంతో టీజర్ ప్రారంభమవుతుంది, ఇది ఇండియన్ సీక్రెట్, ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త, విజనరీ సుభాష్ చంద్రబోస్ గురించి. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించడాన్ని ఆయన ఒక కవర్-అప్ కథగా అభివర్ణించారు. స్పై పాత్ర పోషిస్తున్న నిఖిల్ కి మిస్టరీని ఛేదించే బాధ్యతను అప్పగించారు. తర్వాత తెరపై  లావిష్ యాక్షన్ కనిపించింది.
 
తెలియని వాస్తవాలను తెలుసుకోవడం ఎల్లప్పుడూ గొప్ప విషయం. స్పై ఇండియన్ బెస్ట్ సీక్రెట్  ని చూపించబోతోంది. గ్యారీ బిహెచ్ కథనం పరంగా తొలి చిత్రంతోనే దర్శకుడిగా గొప్ప ముద్ర వేశారు. విజువల్స్ అన్ని గ్రాండ్ గా ఉన్నాయి. ఇది అద్భుతమైన కెమెరా పనితనం, బ్రిలియంట్ బీజీఏం , మంచి పెర్ఫార్మెన్స్ తో కూడిన టీమ్ ఎఫర్ట్.
 
 ‘స్పై’ పాత్రలో నిఖిల్ అద్భుతంగా కనిపించాడు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ రెండో కథానాయిక. ఆర్యన్ రాజేష్ తన  కమ్ బ్యాక్ లో ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా, అభినవ్ గోమటం కీలక పాత్రలో కనిపించనున్నాడు. టీజర్ క్యూరియాసిటీని క్రియేట్ చేసి సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.
 
టీజర్ లాంచ్ ఈవెంట్‌ లో నిఖిల్ మాట్లాడుతూ, “టీజర్ లాంచ్ చేయడానికి ఢిల్లీకి వచ్చాం. కర్తవ్య మార్గ్ పవిత్రమైన, త్యాగానికి చిహ్నం. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ కి సంబంధించి మీరు ఎప్పుడూ వినని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి.  అందుకే మొదటి టీజర్‌ ని నేతాజీ విగ్రహం వద్ద విడుదల చేయాలనుకున్నాం. ఆయన సమక్షంలో ఇక్కడ టీజర్‌ ను విడుదల చేసే అవకాశం మాకు లభించినందుకు గౌరవంగా,  చాలా సంతోషంగా ఉన్నాము. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోంది. ఇది మరొక ప్రయత్నం. మేము కొత్త పాయింట్‌ తో ముందుకు వచ్చాం. కోర్ పాయింట్ తెలిస్తే షాక్ అవుతారు. మన సైనికుల త్యాగం తో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నేతాజీ జీవితంపై సినిమా తీస్తున్నాం. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రం. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌  ప్రధాన కారణం’’ అన్నారు.
 
ఈ చిత్రాన్ని ఈడీ  ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి,  సిఇఓగా చరణ్ తేజ్ ఉప్పలపాటి భారీగా  నిర్మించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెర్రీ ఫ్యాన్స్ అదుర్స్.. మండే ఎండలో బటర్ మిల్క్ ప్యాకెట్స్‌ ఇచ్చారు..