Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాంది కంటే పదిరెట్లు ఉగ్రంని ఆదరించాలని కోరుకుంటున్నా : అల్లరి నరేష్

Naresh, Adivi Shesh, Nikhil, Sandeep Kishan, Vishwak Sen, and others
, మంగళవారం, 2 మే 2023 (12:24 IST)
Naresh, Adivi Shesh, Nikhil, Sandeep Kishan, Vishwak Sen, and others
ఉగ్రం సినిమాతో నరేష్  కేరీర్ మారిపోతుందని ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రముఖులు ప్రసంశించారు. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ‘ఉగ్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిన్న్రరాత్రి జరిగింది. ఉగ్రం తర్వాత యాంగ్రీ నరేష్ అని అందరూ పిలుస్తారాణి  హీరో అడివి శేష్ అనగా,  ఉగ్రంతో నరేష్ డబుల్ బ్లాక్ బస్టర్ కొడతారని  హీరో నిఖిల్ తెలిపారు. 
 
నరేష్ అన్న మాస్ నాకు చాలా ఇష్టం అని  హీరో సందీప్ కిషన్,  ఉగ్రం ట్రైలర్ చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయని  హీరో విశ్వక్ సేన్,  ఉగ్రంలో ప్రేక్షకులు విజువల్ థ్రిల్ పొందబోతున్నారు. నాది హామీ: డైరెక్టర్ హరీష్ శంకర్,  నరేష్ గారు నటుడిగా ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే వుంటారని  డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. 
 
‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటిచింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. 
 
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఉగ్రం నా 60వ సినిమా. ఈ జర్నీలో చాలా మంది దర్శకులు, రచయితలు, నిర్మాతలు  వున్నారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. నాందికి పని చేసిన టీం దాదాపుగా ఉగ్రంకి పని చేశాం. విజయ్, నేను ఈ సినిమా అనుకున్నప్పుడే నాందికి మించి వుండాలని భావించాం. ఆ అంచనాలని అందుకోవడానికి నాతో పాటు విజయ్, సిద్, అబ్బూరి రవి గారు, శ్రీచరణ్ .. అందరూ కష్టపడి పని చేశాం. మిర్నా చక్కగా నటించింది. మా నిర్మాతలు సాహు గారు హరీష్ గారు ఎక్కడా రాజీపడకుండా చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ, ప్రతి కార్మికుడికి పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ వేడుకు వచ్చిన అడివి శేష్,  నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, దర్శకులు శివ నిర్వాణ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, విఐ ఆనంద్ .. అందరికీ కృతజ్ఞతలు. ఉగ్రం కోసం 73 రోజులు రోజుకి దాదాపు పదహారు గంటలు పని చేశాం. ఫైట్ మాస్టర్ రామకృష్ణ మాస్టర్, ప్రుద్వి మాస్టర్  వెంకట్ మాస్టర్ .. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేశారు. ఇందులో ఆరు ఫైట్లు వుంటాయి. ఇప్పటి వరకు మీకు కితకితలు పెట్టాను. కొన్నిసార్లు ఎమోషన్ చేశాను. కానీ ఇందులో ఉగ్ర రూపం చూడబోతున్నారు. ఇందులో ఇంటెన్స్ నరేష్ ని చూస్తారు. నాంది ని గొప్పగా ఆదరించారు. దానికంటే కంటే పదిరెట్లు ఈ సినిమాని ఆదరిస్తారని ఆదరించాలని కోరుకుంటున్నాను. మే 5న సినిమా విడుదలౌతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాలి’’ అని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమలాపాల్ ఆ లిప్ లాక్ గురించి ఏం చెప్పిందంటే?