Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉస్తాద్ భగత్ సింగ్ మాసీవ్ యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (17:37 IST)
Ustad Bhagat Singh
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాస్ ని మెప్పించే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కథానాయకుడు ఉపయోగించే ఆయుధాలన్నింటినీ రివీల్ చేస్తూ ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ పోస్టర్‌ను షేర్ చేశారు.
 
పవన్ కళ్యాణ్ ఈరోజు షూట్‌లో జాయిన్ అయ్యారు. కొత్త షెడ్యూల్ మాసీవ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఖాకీ డ్రెస్‌లో షేడ్స్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి అండ్ టీమ్ మాసీవ్ సెట్‌ని రూపొందించారు.
 
మాస్ పల్స్‌ తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి మాస్‌ను మెప్పించే సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో టెర్రిఫిక్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు.
 
ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.  అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎడిటింగ్ ఛోటా కె ప్రసాద్. స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.  
 
తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌పై కేసు పెట్టిన దివ్వెల మాధురి.. దువ్వాడ శ్రీనివాస్ అరెస్టవుతారా?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌.. రిపేర్ చేసినందుకు రూ.90వేలు బిల్లు.. అంతే విరగ్గొట్టేశాడు..! (video)

శ్రీరాముని వేలు విరిగింది.. బంగారుపూతతో మరమ్మత్తులు చేశాం.. టీటీడీ

సింగపూర్‌తో వైకాపా తెగతెంపులు.. ఏం జరిగిందో కనుక్కోండి.. బాబు

నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్‌.. కేటీఆర్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments