Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాల్తేరు వీరయ్య 200 రోజులు వేడుకని చూస్తుంటే ఒళ్లు పులకరిస్తోంది : మెగాస్టార్ చిరంజీవి

Advertiesment
Waltheru Veeraya 200 Days sheiled
, మంగళవారం, 8 ఆగస్టు 2023 (16:59 IST)
Waltheru Veeraya 200 Days sheiled
మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య', మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన చిత్రం 2023 సంక్రాంతికి విడుదలై టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 200 రోజులను పూర్తి చేసుకుంది. ఇది చిరంజీవి, రవితేజలకు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటి.
 
సినిమా 200 రోజుల రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ టీమ్ మొత్తానికి, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ పాల్గొన్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో దర్శకులు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు సాన హాజరయ్యారు.
 
ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ.. '' ఒకప్పుడు సినిమాలు 100, 175, 200 రోజులు.. సిల్వర్ జూబ్లీ లు ఆడేవి. ఇప్పుడు.. రెండు వారాల్లో అటు ఇటు తేలిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’  200 రోజులు ప్రదర్శిచడం ఆనందంగా ఉంది. రెండు వందల రోజులు సినిమా ఆడి, విజయానికి గుర్తుగా షీల్డ్ ఇచ్చిపుచ్చుకోవడం చూస్తుంటే ఒళ్లు పులకరిస్తోంది. అందరు కలసికట్టుగా పని చేస్తే మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందనడానికి ఇది నిదర్శనం. చరిత్రను తిరగరాసినట్టుగా అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ గారు, రవి గారు చెర్రీ గారికి నా హృదయపూర్వక అభినందనలు.  నా తమ్ముడు రవితేజ ఈ సినిమా ఒప్పుకోవడం అనేది ఈ సినిమా మరో స్థాయికి వెళ్ళడానికి కారణం. తను సహాయ దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. ఈ రోజు మాస్ మహారాజా గా ఎదగడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. తను   మోస్ట్ బిజియస్ట్ హీరో. ఏడాదికి దాదాపు ఐదు సినిమాలు చేస్తున్నాడు. ఇది చాలా మంచి పరిణామం. ఎక్కువ సినిమాలు చేస్తే ఎంతో మందికి ఉపాది లభిస్తుంది. తన వేగంతో నేనూ ధీటుగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను(నవ్వుతూ). తను ఇదు సినిమాలు చేస్తున్నాడు. నేను సుస్మితకి ఒక సినిమా, యువీ క్రియేషన్ కి మరో సినిమా చేస్తున్నాను. వాల్తేరు వీరయ్యకి పని చేసిన అందరికీ ధన్యవాదాలు.'' తెలిపారు  
 
మాస్ మహారాజ రవితేజ మాట్లాడుతూ.. ఇలాంటి వేడుక చాలా ఏళ్ల తర్వాత జరిగింది. చాలా కొత్తగా అనందంగా వుంది. టీం అందరికీ అభినందనలు. మైత్రీ మూవీ మేకర్స్ కి అభినందనలు. బాబీ ఇలానే ముందుకు వెళ్ళాలి. ఈ సినిమాతో మొదలైన పూనకాలు భోళా శంకర్ తో కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.
 
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ.. చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టం. ఫ్యాన్స్ తరపున నా కుటుంబం తరపున అన్నయ్య కి థాంక్స్. మా నాన్నకి వందరోజుల సినిమా చేస్తానని చెప్పాను. అది ఇప్పుడు రెండు వందల రోజులు అయ్యింది. ఆయన ఎక్కడున్నా చాలా గర్వంగా ఫీలౌతారు. నన్ను డైరెక్టర్ ని చేసింది మాస్ మహారాజా రవితేజ గారు. ఆయన పెట్టుకున్న నమ్మకంతోనే ఈ రోజు ఇక్కడ వున్నాను. మైత్రీ మూవీ మేకర్స్ లేకపోతే ఈ సినిమా లేదు.  ఈ సినిమాని ఇంత గ్రాండ్ గా తీయడానికి కారణం సినిమా పట్ల ప్యాషన్, చిరంజీవి గారి పట్ల వారికి వున్న అభిమానం. ఈ విజయం నా టీం అందరిది. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు'' తెలిపారు
 
నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ..  మేము ఎన్ని సినిమాలు,  విజయాలు అందుకున్నప్పటికీ చిరంజీవి గారితో సినిమా చేయడంతో ఒక పరిపూర్ణత వచ్చింది. మెగాస్టార్ గారితో హిట్టు అందుకోవడంలో కిక్కు వేరు. ఈ సినిమాని ఒప్పుకున్నా రవితేజ గారికి ధన్యవాదాలు. చిరంజీవి గారి సినిమా మాస్ క్లాస్ అన్నీ వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇది ముఫ్ఫై ఏళ్లుగా చూస్తున్నాం. ఇది అందరికీ సాధ్యం కాదు. దర్శకుడు బాబీ చాలా హార్డ్ వర్క్ చేసి నమ్మకంగా బ్లాక్ బస్టర్ కొడతామని మొదటి రోజు నుంచే చాలా కాన్ఫిడెంట్ గా జర్నీ స్టార్ట్ చేశారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు' తెలిపారు
 
నిర్మాత నవీన్  యెర్నేని మాట్లాడుతూ.. చిరంజీవి గారితో సినిమా చేయడంతో నా కల నెరవేరింది. వాల్తేరు వీరయ్య ఇంత పెద్ద విజయం సాధించడం, 200 రోజుల పండగ జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. ఇంతకంటే ఏం కోరుకోము. ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. రవితేజ గారు ఈ పాత్ర అంగీకరించి చేసినందుకు చాలా థాంక్స్. ఇంత విజయం ఇచ్చిన బాబీ గారికి థాంక్స్. వాల్తేరు వీరయ్యను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి గారిని ఇప్పుడు యూత్ చూసేలా 70 శాతం మార్పులు చేశాం : మెహర్ రమేష్