Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్వీ మల్హోత్రా చాలా బాగుందే అంటున్న రాజ్ తరుణ్

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (17:31 IST)
Raj Tarun, Malvi Malhotra
రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇదివరకే  విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి.  
 
ఇప్పుడు తిరగబడరసామీ మ్యూజికల్ జర్నీ మొదలైయింది. ఈ చిత్రంలోని 'చాల బాగుందే' పాటని విడుదల చేశారు మేకర్స్. మనసుని హత్తుకునే హార్ట్ ఫుల్ లైవ్లీ మెలోడీగా ఈ పాటని కంపోజ్ చేశారు జెబి.
 చైతు సత్సంగి, లిప్సిక ఈ పాటని మ్యాజికల్ గా పాడారు. శ్రీమణి అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ అండ్ లవ్లీగా వుంది.  
 
ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్. భాష్యశ్రీ డైలాగ్స్ అందిస్తున్నారు.
 
తారాగణం: రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌‌కు ప్రొస్టేట్ కేన్సర్, ఎముకలకు పాకింది

Rainfall: బెంగళూరులో భారీ వర్షాలు.. నీట మునిగిన నివాస ప్రాంతాలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments