Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగార్రాజు నుంచి నా కోసం పాట వ‌చ్చేసింది

Webdunia
ఆదివారం, 5 డిశెంబరు 2021 (18:18 IST)
Naga Chaitanya, Kriti Shetty, Nagarjuna, Ramyakrishna
బంగార్రాజు చిత్రయూనిట్ మొదటి నుండి  విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ లడ్డుండా ఇలా ప్రతీ ఒక్కదానికి విశేషమైన స్పందన లభించింది, కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమాపై అంచనాలు విప‌రీతంగా పెరిగాయి. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.
 
సెకండ్ సింగిల్ ‘నా కోసం’  టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. నేడు ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. తన ప్రేయసి కృతి శెట్టి కోసం నాగ చైతన్య ఎంతలా తనని తాను మార్చుకున్నాడో ఈ పాటలో చెప్పారు. అనూప్ రూబెన్స్ మంచి మెలోడీ ట్యూన్‌ను అందించగా.. సిధ్ శ్రీరామ్ గాత్రం అద్బుతంగా ఉంది.
 
నాగ చైతన్య, కృతి శెట్టిల మధ్య మంచి కెమిస్ట్రీ ఉంది. ఈ పాట చివర్లో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టిలు కనిపించారు.
 
అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో  నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’  చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది.
 
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.
 
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య,  రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments