Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగార్రాజు నుంచి ఇవాళ నాగ చైతన్య ఫస్ట్ లుక్ రేపు టీజ‌ర్‌

Advertiesment
బంగార్రాజు నుంచి ఇవాళ నాగ చైతన్య ఫస్ట్ లుక్ రేపు టీజ‌ర్‌
, సోమవారం, 22 నవంబరు 2021 (17:42 IST)
Naga Chaitanya First Look
‘బంగార్రాజు’ సినిమా నుంచి నాగార్జున తొలిస్టిల్ విడుద‌ల చేసి త‌ర్వాత కృతి శెట్టి స్టిల్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య  లేడ‌సీ ఫ‌స్ట్ అన్న కామెంట్ పెట్టాడు. ఆయ‌న అన్న‌ట్లుగానే ఈరోజు త‌న కొత్త లుక్‌ను విడుద‌ల‌చేశారు. చేతిలో కర్ర పట్టుకుని నాగ చైతన్య కనిపించడం, ఆ గెటప్, చేతికి బ్రాస్ లెట్ ఇలా అన్ని చూస్తుంటే పాత్ర మీద అందరికీ ఆసక్తి పెరిగిపోతోంది. రేపు నాగ చైతన్య బర్త్ డే. క‌నుక  (నవంబర్ 23) సందర్బంగా టీజర్‌ను కూడా విడుదల చేయబోతోన్నారు. 
 
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. తండ్రీ కొడుకుల బంధాన్ని చక్కగా పండించి అందరినీ మెప్పించ‌బోతున్నారు. ప్రస్తుతం  సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న  ‘బంగార్రాజు’ చిత్రంతో ఈ ఇద్దరూ మరో సారి మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు.
 
రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న బంగార్రాజు చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తున్నారు. నాగ చైతన్యకు జోడిగా కృతి శెట్టి కనిపించనున్నారు. నాగలక్ష్మీగా కృతి శెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల చేయగా.. మంచి స్పందన వచ్చింది.  
 
లడ్డుండా అనే పాట ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటకు విశేష స్పందన లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్‌తో అయితే నాకంత అవసరం లేదంటున్న జాహ్నవి కపూర్