Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లేడీస్ ఫస్ట్.. అందుకే కృతి శెట్టి రిలీజ్ చేశార‌న్న నాగ‌చైత‌న్య‌

Advertiesment
లేడీస్ ఫస్ట్.. అందుకే కృతి శెట్టి రిలీజ్ చేశార‌న్న నాగ‌చైత‌న్య‌
, శుక్రవారం, 19 నవంబరు 2021 (19:10 IST)
Kriti Shetty
నాగార్జున, రమ్యకృష్ణ, నాగ‌చైత‌న్య‌, కృతి శెట్టి జంట‌లుగా న‌టిస్తున్న సినిమా ‘బంగార్రాజు’ . ఈ సినిమా నుంచి ఇటీవ‌లే నాగార్జున స్టిల్ వ‌చ్చింది. తాజాగా కృతి శెట్టి స్టిల్ కూడా వ‌చ్చింది. దీనికి నాగ‌చైత‌న్య స్పందించారు. బంగార్రాజు త్వరలోనే రాబోతోంది. లేడీస్ ఫస్ట్.. నాగలక్ష్మీ పాత్రలో కృతి శెట్టి అంటూ నాగ చైతన్య ట్వీట్ చేశారు. ఎన్నికల్లో గెలిచినట్టుగా చేతిని ఊపుతూ నాగలక్ష్మీ కనిపిస్తున్నారు. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఎంతో అందంగా కనిపిస్తున్నారు. పోస్టర్‌ను బట్టి చూస్తే కృతి శెట్టి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ఉందని తెలుస్తోంది.
 
సోగ్గాడే చిన్న నాయన సినిమాలో బంగార్రాజు పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి  కళ్యాణ్ కృష్ణ అద్బుతమైన కథతో రాబోతోన్నారు. ప్రీక్వెల్‌లో ఉన్నట్టుగానే నాగార్జున సరసన రమ్యక‌ష్ణ నటించనున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. నటీనటులందరి మీద కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
 
రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో బంగార్రాజు చిత్రం రాబోతోంది. సోగ్గాడే చిన్ని నాయన వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి ప్రీక్వెల్ కావడంతో అంచనాలు ఆకాశన్నంటాయి. పైగా నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాజల్ అగర్వాల్ - మను చరిత్ర నుంచి ‘హఠాత్తుగా’ పాట ఆవిష్క‌రించిన వర్మ