Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లడ్డుందా.. అంటున్న బంగార్రాజు - రేపు పాట విడుద‌ల‌

Advertiesment
Bangarraju
, సోమవారం, 8 నవంబరు 2021 (12:42 IST)
Bangarraju
నాగార్జున, రమ్యకృష్ణ కలసి `సోగ్గాడే చిన్నినాయన` సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి `బంగార్రాజు` పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు నాగార్జున రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనతో అందరినీ మెప్పించిన కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య, కృతి శెట్టిలు మరో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 
అనూప్ రూబెన్స్ స్వరపరచిన లడ్డుందా అంటూ సాగే ఈ మొదటి పాటను నవంబర్ 9న  విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో  నాగార్జున సందడి చేస్తున్నారు. ఈ ప్రోమోలో నాగార్జున తన బృందంతో కలిసి సందడి చేస్తున్నట్టు కనిపిస్తోంది.
 
అయితే ఇందులో నాగార్జున పక్కన ఉన్నది ఎవరో తెలియడం లేదు. నవంబర్ 9న ఉదయం 9:09 గంటలకు రిలీజ్ కానుంది. పోస్టర్, ప్రోమోను గమనిస్తే ఈ పాట అందరినీ కట్టిపడేసేలా కనిపిస్తోంది.
 
సోగ్గాడే చిన్నినాయన సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయింది. అందుకే ఈ కాంబినేషన్ మీద ఇంతటి అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్టే అనూప్ రూబెన్స్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
‘బంగార్రాజు’ను కళ్యాణ్ కృష్ణ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉండబోతోన్నాయి.
 
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.
 
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య,  రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ
 
సాంకేతిక బృందం-  కథ, దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ,  నిర్మాత :  అక్కినేని నాగార్జున, స్క్రీన్ ప్లే :  సత్యానంద్  , సంగీతం :  అనూప్ రూబెన్స్,  సినిమాటోగ్రఫర్ : యువరాజ్,ఆర్ట్ డైరెక్టర్  : బ్రహ్మ కడలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"భీమ్లా నాయక్" నుంచి 'లాలా భీమ్లా' వచ్చేసింది...