Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జ‌గ‌న్‌తో చిరంజీవి బ‌దులు నాగార్జున మంత‌నాలు! వ్యక్తిగ‌తం అంటే ఇదేనా!

Advertiesment
జ‌గ‌న్‌తో చిరంజీవి బ‌దులు నాగార్జున మంత‌నాలు! వ్యక్తిగ‌తం అంటే ఇదేనా!
, గురువారం, 28 అక్టోబరు 2021 (20:01 IST)
Nagrajuna, Chiranjeevi with YS. Jagan (File photo)
ఈరోజు నాగార్జున‌, ఎ.పి. సి.ఎం. వై.ఎస్‌. జ‌గ‌న్‌తో భేమీ కావ‌డం సినిమారంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ప‌లు షూటింగ్‌లు జ‌రిగే చోట ఇదే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. పైగా నాగార్జ‌న వెంట నిరంజ‌న్ రెడ్డి అనే నిర్మాత వున్నారు. నాగార్జున‌తో వైల్డ్ డాగ్ సినిమా చేశాడు. మెగాస్టార్‌తో ఆచార్య సినిమా ప్ర‌స్తుతం చేస్తున్నాడు. రియ‌ల్ ఎస్టేట్‌, సినిమా రంగానికి చెందిన నిరంజ‌న్ రెడ్డి నాగార్జునతో ఇంకా ప‌లు సినిమాలు చేయాల‌నే ప్లాన్‌లో వున్నాడు. అయితే ఈరోజు నాగార్జు, జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డం కేవ‌లం వ్య‌క్తిగ‌తం అని స్టేట్ మెంట్ ఇచ్చాడు. మ‌రోవైపు సినిమారంగంకుచెందిన ఇద్ద‌రు నిర్మాత‌లు కూడా ఆయ‌న వెంట వున్నారు. దీనివెనుక ఏదో మ‌ర్మం వుంద‌ని మాత్ర‌మే ఫిలిం న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.
 
వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హయాంలో నాగార్జున‌ను ప్ర‌భుత్వ‌ప‌రంగా కొన్ని వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల‌కు వినియోగించుకున్నారు. స్వ‌త‌హాగా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కాంగ్రెస్ పార్టీ వాసే. అయితే ఇక్క‌డ హాట్ టాపిక్‌గా మార‌డానికి ప్ర‌స్తుతం సినిమారంగంలో నెల‌కొన్న రెండు అంశాలు ప్ర‌ధానంగా గోచ‌రిస్తున్నాయి. మామూలుగా జ‌గ‌న్‌తో మీట్ అంటే చిరంజీవి హాజ‌రుకావాలి. కానీ ప్ర‌స్తుతం ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చే స్థితిలో లేర‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల ర‌చ్చ‌లో ఆయ‌న మాట నెగ్గ‌క‌పోగా అభాసుపాల‌య్యార‌నే టాక్ వుంది. ప్ర‌కాష్ రాజ్ ఓడిపోయాక త‌న ప్ర‌మేయంలేకుండా త‌న‌పేరు ప్ర‌కాష్ పానేల్‌కు స‌పోర్ట్ అని ప్ర‌క‌టించారు. ఇది మ‌రీ హాస్యాస్ప‌దంగా మారింది. అనంత‌రం రోజువారీ వ్యాయాయంలో భాగంగా చేయి బెణికింద‌ని క‌ట్టుక‌ట్టుకుని మ‌రి చూపించారు మెగాస్టార్‌.
 
ఇంకోవైపు స‌మంత‌, చైత‌న్య దాంప‌త్య విష‌యంలో నాగార్జున కుటుంబంలో కొంచెం ఇబ్బంది వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎవ‌రిత‌ప్ప‌నేది వారి వారి వ్య‌క్తిగ‌తం క‌నుక వారి ప‌ర్స‌న‌ల్ విష‌యాలు చ‌ర్చించ‌డం అన‌వ‌స‌రం అంటూ కోర్టు కూడా కొంత‌మందిపై చుర‌క‌లు వేసింది. ఇదిలా వుండ‌గా, నాగ‌చైత‌న్య ఈసారి రెడ్డి కులానికి చెందిన అమ్మాయినే పెండ్లి చేసుకోబోతున్నాడ‌నే రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. నాగార్జున వ్య‌క్తిగ‌తం అన‌డం వెనుక ఇది కూడా ఓ కార‌ణంగా క‌నిపిస్తోంది. అంత‌కుముందు సుమంత్ కూడా కీర్తిరెడ్డిని వివాహం చేసుకోవ‌డం జ‌రిగింది. ఆ త‌ర్వాత ప‌రిణామాలు తెలిసిన‌వే.
 
మొత్తంగా చూస్తే, చిరంజీవి చేయాల్సిన ఆన్‌లైన్ టికెట్ల‌పై సినిమా రాయ‌బారం నాగార్జున చేత చేయించార‌నే టాక్ ఫిలింన‌గ‌ర్‌లో నెల‌కొంది. ఇక ఆయ‌న ప‌క్క‌న వెళ్ళిన‌వారు జ‌గ‌న్‌కు స‌న్నిహితులైన నిర్మాత‌లు కావ‌డం కూడా ఓ విశేషంగా చెప్ప‌కుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్పక విమానం ట్రైలర్ కు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్న‌ల్‌