Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇదంతా నేను ఆశించినదే.. దేవుడు నాకు సరైన శక్తిని ఇచ్చాడు.. సమంత

Advertiesment
Divorce
, గురువారం, 2 డిశెంబరు 2021 (11:06 IST)
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. హీరో నాగ చైతన్య సోషల్ మీడియాలో విడాకులు ప్రకటించిన తర్వాత ఆమె ట్రోల్‌కు గురయ్యారు. ఆపై, సమంత ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపి, తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్రకు వెళ్లింది.
 
ఇటీవల, నటి ఒక ప్రముఖ పత్రికతో ఒక సంభాషణలో, తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి చెప్పుకొచ్చింది.  ఇదంతా తాను ఆశించిందేనని.. శాశ్వతం అనేది ఏదీ లేదు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేవుడు తనకు సరైన శక్తిని ఇచ్చాడని భావిస్తున్నానని సమంత వెల్లడించింది. 
 
లాక్ డౌన్ సమయంలో తాను ధ్యానం చేయడం కూడా ప్రారంభించానని తెలిపింది. " నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత, సామ్ సోషల్ మీడియాలో క్రూరంగా ట్రోల్ చేయబడ్డాను. విభిన్న అభిప్రాయాలు కలిగి ఉండాలని నేను ప్రజలను  ప్రోత్సహిస్తాను. కానీ మనం ఇప్పటికీ ఒకరినొకరు ప్రేమించవచ్చు, కరుణను కలిగివుండవచ్చు. 
 
వారి నిరాశను మరింత నాగరికమైన రీతిలో వ్యక్తం చేయమని మాత్రమే తాను అభ్యర్థిస్తాను అంటూ సమంత తెలిపింది. సమంతకు గర్భస్రావం జరిగిందని వస్తున్న పుకార్లు తనను బాధించాయి. తనకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపింది. 
 
"చాయ్ మరియు నేను మా స్వంత మార్గాలను అనుసరించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా సంబంధంలో ఒక దశాబ్దం పైగా స్నేహం కలిగి ఉండటం మా అదృష్టం, ఇది ఎల్లప్పుడూ మా మధ్య ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మేము నమ్ముతున్నాము... అంటూ సమంత వ్యాఖ్యానించింది. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శకుంతలం' విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రిన్స్ మహేష్ బాబు సర్జరీ కోసం అమెరికా