Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్యామ్ సింగ రాయ్.. కృతి శెట్టితో రొమాన్స్‌

Advertiesment
శ్యామ్ సింగ రాయ్.. కృతి శెట్టితో రొమాన్స్‌
, గురువారం, 25 నవంబరు 2021 (17:14 IST)
Nani kriisetty
నాని శ్యామ్ సింగ రాయ్ నుంచి వస్తున్న ప్రతీ ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ భారీగా ఉండబోతోన్నందుకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయాన్నా కేటాయించారు. ఈ గ్యాప్‌లో సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు.
 
మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా సెకండ్ సింగిల్ ఏదో ఏదో పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాని, కృతి శెట్టిల మీద రూపొందించిన ఈ మెలోడి సాంగ్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. టైటిల్ సాంగ్‌తో ఆకట్టుకున్న  మిక్కీ జే మేయర్.. ఇప్పుడు మెలోడి ట్యూన్‌ ఇచ్చారు.
 
కృష్ణ కాంత్ రాసిన ఈ పాటను.. చైత్ర అంబడిపుడి ఆలపించారు. మెలోడి ట్యూన్, అద్బుతమైన గాత్రం, ఆకట్టుకునే సాహిత్యంతో పాటు నాని, కృతి శెట్టిల రొమాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ పాటలోనే లిప్ లాక్ కూడా కనిపిస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ వెరైటీ ట్యూన్స్ ఇవ్వడంతో మిక్కీ జే మేయర్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
 
సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు... జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
జాతీయ అవార్డు గ్రహీత కృతి మహేష్, ప్రతిభా వంతుడైన యశ్ మాస్టర్ ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫర్లుగా పని చేస్తున్నారు.
 
రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం వంటి వారు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.
 
నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం, జిషు సేన్ గుప్తా, లీలా సామ్సన్, మనీష్ వద్వా, బరున్ చందా తదితరులు
 
సాంకేతిక బృందం
దర్శకత్వం : రాహుల్ సంకృత్యాన్
నిర్మాత : వెంకట్ బోయనపల్లి
బ్యానర్ : నిహారిక ఎంటర్టైన్మెంట్
కథ : సత్యదేవ్ జంగా
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫర్ : సాను జాన్ వర్గీస్
ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ వెంకట రత్నం (వెంకట్)
ఎడిటర్ : నవీన్ నూలి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుమ జ‌రిపే - జయమ్మ పంచాయితీ ఏమిటి?