Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సీజన్‌లో రాజమౌళి ఎదురు చూస్తున్న చిత్రమేది?

మెగా పవర్‌స్టార్ రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం అధికారిక టీజర్‌ను బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (10:25 IST)
మెగా పవర్‌స్టార్ రాంచరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం అధికారిక టీజర్‌ను బుధవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌ను ఇప్పటికే ఐదు మిలియన్ల మంది వీక్షించారు. టీజర్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అనేక మంది సినీ సెలబ్రిటీలు, ప్రేక్షకులు, అభిమానులు ఈ టీజర్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు. చరణ్‌తో మంచి మిత్రత్వం కలిగిన దర్శకధీరుడు రాజమౌళి అయితే టీజర్ చాలా బాగుందని, ఈ సీజన్లో తాను ఎక్కువగా ఎదురుచూస్తున్న చిత్రం ఇదేనని స్పందించారు.
 
కాగా, ఈ చిత్రంలో రాంచరణ్... చిట్టిబాబు పాత్రలో నటిస్తుండగా ఆయన సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. యాంకర్ అన‌సూయ ఈ మూవీలో రంగ‌మ్మ‌త్త‌గా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monsoon: నైరుతి రుతుపవనాలు - అంతకుముందే అల్పపీడనం.. తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్

ఏపీలో మరికొత్త జిల్లాలు.. పాత జిల్లాల పునర్విభజన చేస్తారా

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments