బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు బీఎంసీ నోటీసులు

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (13:31 IST)
బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు బృహైన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసు జారీచేసింది. తన ఆరు అంతస్తుల నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారని, దాన్ని తిరిగి నివాస భవనంగా పునరుద్ధరించాలని బీఎంసీ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసును గత నెల 15వ తేదీన జారీ చేయగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
గతంలో సోనూసూద్ భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే విధించింది. 'మీ భవనంలోని 1 నుంచి 6వ అంతస్తులలో మీరు బస/బోర్డింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు మీరు లేఖలో పేర్కొన్నారు. మంజూరైన ప్లాన్ల కోసం ఆ భవనం నివాసం అవసరరాలకు ఉపయోగిస్తామని మీరు పేర్కొన్నారు. పునరుద్ధరణకు అవసరమైన పని పురోగతిలో ఉందని మీరు చెప్పారు' అని బీఎంసీ నోటీసులో పేర్కొంది. 
 
బీఎంసీ కార్యలయం అక్టోబరు 20వ తేదీన స్థలాన్ని పరిశీలించగా ఆమోదించిన ప్రణాళిక ప్రకారం ఇంకా పనిని పునరుద్ధరించలేదని గమనించామని బీఎంసీ నోటీసు తెలిపింది. హోటల్‌ను నివాస భవనంగా మార్చాలని బీఎంసీ నోటీసులో సోనూసూద్‌ను కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో ఘోర పరాజయం.. రాజకీయాలకు బైబై చెప్పనున్న ప్రశాంత్ కిషోర్?

మావోయిస్టుల మాట విని యువత చెడిపోవద్దు : బండి సంజయ్ హితవు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments