అర్థరాత్రి తాగి ఖలేజాను చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే : సి. కళ్యాణ్

దేవీ
గురువారం, 29 మే 2025 (09:46 IST)
C.Kalyan- Kaleja poster
మహేష్ బాబు 'ఖలేజా' చిత్రం మే 30, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ-రిలీజ్ కు సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుల్లితెరపై వచ్చాక ఎందుకు ఈ సినిమా థియేటర్లలో ఆదరణకు నోచుకోలేదని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 14 ఏళ్ళక్రితం ఈ సినిమా విడుదలైతే మహేష్ బాబు ఫ్యాన్సే సినిమాను చంపేశారని నిర్మాత సి. కళ్యాణ్ వెల్లడించారు. 
 
నిన్న రాత్రి ఖలేజా ప్రీరిలీజ్ గురించి ఆయన మాట్లాడుతూ, గతంలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో నేను మిడ్ నైట్ షోకు పర్మిషన్ ఇవ్వనని విజయవాడలో చెప్పాను. దానితో చాలామంది అభిమానులు కలత చెందారు. ఆ తర్వాత కొందరు పెద్దలు కోరికమేరకు ఏర్పాటు చేశాను. సినిమా చూశాక అర్థరాత్రి మందుతాగి నోటికొచ్చినట్లు మాట్లాడారు. అసలు నీకు సినిమా తీయడం వచ్చా? దర్శకుడు చెత్త సినిమా తీశాడు.. అంటూ నానారకాలుగా మాట్లాడారు. ఖలేజా సినిమాను ఆనాడు చంపేసింది మహేష్ ప్యాన్సే.
 
కానీ, ఇప్పడు 14 ఏళ్ళ తర్వాత రీరిలీజ్ చేయమని వాళ్ళే అడుగుతున్నారు. అప్పట్లో మేం చాలా తప్పుగా మాట్లాడామని క్షమాపణలు కోరుకుంటున్నామని తెలిపారు. 14 ఏళ్ళ తర్వాత ఖలేజా సక్సెస్ కు అర్హత వస్తుందని రాసి ఉండవచ్చు" అని ఆయన అన్నారు, రీ-రిలీజ్ కు అన్నిచోట్ల బుకింగ్ అద్భుతంగా వున్నాయి. త్వరలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తానని కళ్యాణ్ అన్నారు.
 
ఈ చిత్రంలో అనుష్క శెట్టి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, సునీల్, తదితరులు నటించారు. మణి శర్మ ఈ సౌండ్‌ట్రాక్‌ను కంపోజ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments