పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “హరిహర వీరమల్లు”. ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్ తారతార.. నేడు చెన్నైలో విడుదలచేశారు. అన్ని భాషల్లోనూ ఈ పాటను విడుదలచేసి ప్రదర్శించారు. అప్పటి కాలంలోని మార్కెట్ లో నిధి పై చిత్రీకరించే సాంగ్ ఇది. డబ్బు మూటతో వీరమల్లు వచ్చి ఆమెకు కన్నుకొట్టడంతో సాంగ్ ప్రోమో పూర్తయినట్లు చూపించారు.
కీరవాణి ట్యూన్ ని అందించగా శ్రీహర్ష ఈమని ఇచ్చిన సాహిత్యం కూడా బాగుంది. ఇక ఈ సాంగ్ లో లిప్సిక భాష్యం గొంతు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ ఆకర్షణీయంగా వున్నాయి. ఈ పాటలో వెన్నెలకిశోర్ కూడా కనిపించాడు. తమిళంలో అక్కడి కమేడియన్స్ నటించారు. నిధి అగర్వాల్ తన గ్లామర్ తోనూ డాన్స్ మూమెంట్స్ తో అలరించింది. ఈ పాటలో నిధి వస్త్రధారణ, కవ్వించే సాహిత్యం కొంత వున్నా అసభ్యతకు తావులేకుండా తీయడం విశేషం. జూన్ 12న గ్రాండ్ గా భారీ స్థాయిలో సినిమా విడుదల కాబోతోంది.