"మహర్షి" ఫ్లెక్సీ కడుతూ మహేష్ బాబు అభిమాని

Webdunia
గురువారం, 9 మే 2019 (09:21 IST)
ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'మహర్షి'. ఈ చిత్రం మే 9వ తేదీ గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా మహేష్ బాబు ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతానికి గురై అభిమాని మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం ధవళేశ్వరంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. 
 
స్థానిక పారిశ్రామికవాడ కాలనీకి చెందిన యర్రంశెట్టి రాజీవ్‌ (27) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఈయన మహేష్ బాబు తీవ్ర అభిమాని. అయితే మహర్షి చిత్రం విడుదలను పురస్కరించుకుని ఐరన్‌ ఫ్రేమ్‌తో కూడిన ఫ్లెక్సీ కట్టేందుకు మరో వ్యక్తితో కలసి.. మురళీకృష్ణ థియేటర్‌ పక్కన బిల్డింగ్‌పైకెక్కాడు. 
 
ఫ్లెక్సీ ఫ్రేమ్‌ విద్యుత్‌ వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురైన రాజీవ్‌ ఒక్కసారిగా బిల్డింగ్‌పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debits: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

గ్రీన్‌ఫీల్డ్ అమరావతి.. రైతు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం.. మంత్రి నారాయణ

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఫ్రేమ్‌వర్క్.. జీవోను జారీ చేసిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments