Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేష్ బాబు 'మహర్షి' మానియా మామూలుగా లేదుగా... తెలంగాణలో 5 షోలు...

Advertiesment
మహేష్ బాబు 'మహర్షి' మానియా మామూలుగా లేదుగా... తెలంగాణలో 5 షోలు...
, బుధవారం, 8 మే 2019 (16:12 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం మ‌హ‌ర్షి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 9న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. అందుచేత పెట్టిన పెట్టుబ‌డి వెన‌క్కి వ‌స్తుందా రాదా అని కాస్త టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. అందుక‌నే తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్‌ని సంప్ర‌దించి అద‌నంగా మ‌రో షో వేసుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌మ‌ని అడిగార‌ట‌. 
 
దీనికి తెలంగాణలోని అన్ని థియేటర్లలో ‘మహర్షి’ని 5 షోలు వేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలవుతున్న మే 9 నుంచి 14 రోజుల పాటు, అంటే మే 22 వరకు అన్ని థియేటర్లు రోజుకు 5 షోలు ఆడించవచ్చు.
 
వేసవి సెలవుల్లో ‘మహర్షి’ కోసం ప్రజలు అనేక అంచనాలతో ఎదురుచూస్తున్నారనీ, బ్లాక్ మార్కెటింగ్‌నీ, థియేటర్ల వద్ద జన సందోహాన్ని నిరోధించడానికీ, శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవకుండా ఉండటానికీ 5 షోలకు అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు. 
webdunia
 
ఉదయం 8 నుంచి 11 గంటల వరకు అదనపు ఆటకు అనుమతినిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లలకూ ఇది వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వం రెండు వారాల పాటు పర్మిషన్ ఇచ్చినప్పటికీ అన్ని రోజులు 5 ఆటలు వేయకపోవచ్చు. కారణం అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్నందున తొలి వారం తర్వాత యధాతథంగా 4 ఆటలే ప్రదర్శించే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా 5 ఆటల పర్మిషన్‌తో ‘మహర్షి’కి రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రావ‌డం ఖాయం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగా హీరో వైష్ట‌వ్ తేజ్ మూవీ టైటిల్ 'ఉప్పెన'.... మామూలుగా లేదుగా...