మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు.. వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే.. ఈ మూవీలో వైష్టవ్ తేజ్ జాలరిగా నటిస్తున్నాడు.
పోస్టర్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ మూవీకి జాలరి అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారని ప్రచారం జరిగింది కానీ... ఎందుకనో ఆ టైటిల్ పెట్టడడం లేదట. మాస్ టైటిల్ పెట్టాలనుకున్నారేమో... ఉప్పెన అనే టైటిల్ ఖరారు చేసారని తెలిసింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మాస్ టైటిల్ కలిసొస్తుందా..? మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ కొత్త హీరోకి ఉప్పెనలా భారీ హిట్ చేకూరుతుందా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.