మహర్షి.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమా ఈ నెల 9వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాపై అభిమానుల అంచనా ఎక్కువగానే ఉంది. సినిమాలో మహేష్ బాబు విద్యార్థిగా, వ్యాపారవేత్తగా కనిపిస్తున్నాడు. సినిమా టీజర్‌ను లక్షలాదిమంది చూసేశారు. సినిమాలోని పాటలు నిరాశపరిచినా టీజర్ మాత్రం అభిమానులను బాగానే ఆకట్టుకుంది. దీంతో సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.
మరోవైపు సినిమా ప్రి-రిలీజ్ ఫంక్షన్లో పూజా హెగ్డే, మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబును హీరోగానే కాకుండా ఒక మంచి డైరెక్టర్‌గా కూడా చూశాను. ఆయనలో దర్శకుడు కూడా ఉన్నాడు. మెగా ఫోన్ పట్టుకుని డైరెక్షన్ చేస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.
దీంతో మహేష్ బాబు కూడా పూజా వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించారు. నన్ను డైరెక్టర్‌గా ఊహించుకున్న పూజాకు నా ధన్యవాదాలు. అయితే నేను డైరెక్టర్‌గా చేయలేను. హీరో చేసే పని హీరో చేయాలి. డైరెక్టర్ చేసే పని డైరెక్టర్ చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పేశారు మహేష్ బాబు.