Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి ఫాంహౌస్‌లో బూడిదైన సైరా సెట్... చ‌ర‌ణ్ రియాక్ష‌న్..!

Advertiesment
Ram Charan
, శనివారం, 4 మే 2019 (18:19 IST)
టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ మణికొండలోని ఆయన ఫాంహౌస్‌లో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి తదుపరి చిత్రం ‘సైరా’ కోసం వేసిన సెట్టింగ్ మంటల్లో తగలబడింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 
 
ప్రమాదంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలు అదుపు చేసారు. అలాగే, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించిన‌ప్ప‌టికీ... వారు వ‌చ్చిన‌ప్ప‌టికీ సినిమా సెట్ దాదాపు బూడిదైంది. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు సమాచారం. సైరా సెట్ మంట‌ల్లో కాలిపోయింది అనే వార్త‌లు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ చిత్ర నిర్మాత రామ్‌చరణ్‌ ఈ విషయాన్ని అధికారంగా ధృవీకరించారు. ఈ ఘటనపై రామ్ చ‌ర‌ణ్ ఫేస్ బుక్‌లో స్పందిస్తూ... కోకాపేటలో వేసిన సైరా సెట్‌ దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఏ ఒక్కరికి ప్రమాదం జరగలేదు. టీమ్ మెంబ‌ర్స్ అంతా క్షేమంగా ఉన్నారు. మా చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని తెలియజేశారు. అత్యంత భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, జ‌గ‌ప‌తి బాబు, సుదీప్, విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే.. సెట్ కాలిపోవ‌డం వ‌ల‌న సైరా ముందు చెప్పిన‌ట్టుగా ద‌స‌రాకి వ‌స్తుందా..? రాదా అనేది తెలియాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందరూ అది పెట్టుకుని వెళ్ళమని చెబుతున్న రాశీఖన్నా