Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిలీజ్‌కు ముందే "మహర్షి" నిర్మాతలకు కాసులపంట

Advertiesment
రిలీజ్‌కు ముందే
, బుధవారం, 8 మే 2019 (12:46 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "మహర్షి". ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. వంశీ పైడివల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సి.అశ్వినీదత్, పొట్లూరు వరప్రసాద్‌లు కలిసి సంయుక్తంగా నిర్మించారు. 
 
శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో సుమారు 400 స్క్రీన్లపై రిలీజ్ కానుంది. పైగా, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో రూ.150 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఒక్క తెలుగు హక్కులే రూ.100 కోట్లను సంపాదించి పెట్టాయి. ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కానీ, ఈ చిత్రం ప్రిరిలీజ్ బిజినెస్ మాత్రం ఇప్పటికే రూ.150 కోట్ల మేరకు తెచ్చిపెట్టింది. ఇక చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంటే మాత్రం నిర్మాతల పంట పండినట్టేనని ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంత వేడైనా అక్కడ మాత్రం చల్లగానే ఉంటుంది... ఆంధ్రాలో మరో ఊటి.. ఎక్కడ?